బ్యాంక్ ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్ అంటే ఏంటి ? డబ్బు పంపే ముందు ఇలా సులభంగా తెలుసుకోండి..

First Published Jan 20, 2022, 5:15 PM IST

ఎవరికైనా డబ్బు పంపడానికి లేదా ఎవరినుండైన డబ్బు పొందడానికి మనకు ముఖ్యంగా బ్యాంకు ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్ (IFSC code)చాలా అవసరం. ఒకోసారి బ్యాంక్ ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్ తెలియక సతమతమవుతుంటాం.. కానీ ఈ రోజుల్లో చాలా డిజిటల్ పేమెంట్లు(digital payments) అందుబాటులోకి వచ్చాయి.  కానీ ఒకోసారి వెంటనే డబ్బు పంపాలన్న లేదా పొందాలన్న ఎన్‌ఈ‌ఎఫ్‌టి, ఆర్‌టి‌జి‌ఎస్ ఎంతో సహాయపడుతుంది.  

అయితే కొన్ని పద్ధతుల సహాయంతో మీరు మీ బ్యాంక్  ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్‌ను కనుగొనవచ్చు. డబ్బు పంపేటప్పుడు సంబంధిత వ్యక్తి బ్యాంక్  ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్  తప్పనిసరి. ఈ కోడ్‌ను ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీరు అతని ఖాతాకు డబ్బును బదిలీ చేయగలుగుతారు. ఐ‌ఎఫ్‌ఎస్‌సి  అంటే  ఇండియన్ ఫైనాన్స్ సిస్టమ్ కోడ్ అని అర్ధం. ప్రతి బ్యాంక్ బ్రాంచ్‌కు వేర్వేరు ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్ ఉంటుంది.

ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్ అంటే ఏమిటి?
ఐ‌ఎఫ్‌ఎస్‌సి  అనేది 11 అంకెల కోడ్.  దీనిని ప్రతి బ్యాంకు శాఖకు జారీ చేయబడుతుంది. ఈ కోడ్ ఎలక్ట్రానిక్ చెల్లింపు కోసం ఉపయోగించబడుతుంది. నెట్ బ్యాంకింగ్‌లో  ఎన్‌ఈ‌ఎఫ్‌టి  (NEFT), ఆర్‌టి‌జి‌ఎస్ (RTGS) అండ్ ఐ‌ఎం‌పి‌ఎస్ (IMPS) ద్వారా డబ్బు పంపేటప్పుడు  ఈ కోడ్ తప్పనిసరి అవసరం ఉంటుంది.

ఈ 11 అంకెల కోడ్‌లో మొదటి 4 అంకెలు బ్యాంకు పేరును సూచిస్తాయి. ఐదవ అంకె 0 అండ్ చివరి 6 అంకెలు బ్రాంచ్ కోడ్‌ను సూచిస్తాయి. కింద పేర్కొన్న దశలను అనుసరించడం ద్వారా మీరు మీ బ్యాంక్ ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్‌ను సులభంగా కనుగొనవచ్చు.

బ్యాంక్ పాస్ బుక్
ప్రతి బ్యాంకు వారి  ఖాతాదారులకు పాస్‌బుక్‌ను అందజేస్తుంది. మీరు మీ బ్యాంక్ పాస్‌బుక్ నుండి ఐ‌ఎఫ్ఎస్‌సి కోడ్‌ని కనుగొనవచ్చు. ఇందుకు మీరు పాస్‌బుక్ మొదటి పేజీని చూస్తే సరిపోతుంది. అక్కడ  ఈ కోడ్‌ని సులభంగా కనిపిస్తుంది.  

చెక్ బుక్ 
మీరు చెక్ బుక్ నుండి కూడా మీ బ్యాంక్ ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్‌ను కనుగొనవచ్చు. చాలా బ్యాంకుల చెక్‌బుక్‌లో ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ పైభాగంలో ఉంటుంది మరికొన్ని బ్యాంకు చెక్‌బుక్‌ల్లో కింది భాగంలో ఉంటుంది.  

వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా
మీరు బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీ బ్యాంక్ ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్‌ను తెలుసుకోవచ్చు. అయితే అధికారిక వెబ్‌సైట్‌లో చూపించిన ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్ మాత్రమే నమ్మశక్యమైనది. ఈ విషయంలో  ఎలాంటి పొరపాటు చేయవద్దు.

click me!