స్టాక్ మార్కెట్‌ భారీ పతనం: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ 248 పాయింట్లకు పైగా క్రాష్..

First Published Jan 20, 2022, 4:22 PM IST

నేడు స్టాక్ మార్కెట్‌(stockmarket)లో భారీ పతనం చోటు చేసుకుంది. ట్రేడింగ్‌లో బిఎస్‌ఇ(bse) 30 షేర్ల సూచీ సెన్సెక్స్ (sensex)వరుసగా రెండు రోజుల మందగమనం మధ్య 883 పాయింట్లు పతనమై 59,217 స్థాయి వద్ద ముగిసింది. దీనితో పాటు నిఫ్టీ (nifty) కూడా పడిపోయి 248 పాయింట్లు పతనమై 17,689 స్థాయిలో  ముగిసింది.  

 ఉదయం స్టాక్ మార్కెట్ మిశ్రమ ప్రపంచ సూచనల మధ్య  నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 131 పాయింట్లు కోల్పోయి 59,967 వద్ద 60 వేలకు దిగజారింది. కాగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ ఇండెక్స్ 29 పాయింట్ల పతనంతో 17,914 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 

3 రోజుల్లో భారీ నష్టాలను చవిచూసిన ఇన్వెస్టర్లు 
ఈ వారంలోని మొదటి రోజున సోమవారం స్టాక్ మార్కెట్‌ లాభాలలో కొనసాగుతు సెన్సెక్స్ 61,385 స్థాయికి చేరుకుంది. అప్పుడు బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం విలువ రూ.2,80,02,438 కోట్లు. ఆ తర్వాత షేర్ మార్కెట్‌లో డౌన్‌ట్రెండ్‌ మొదలై బుధవారం ఈ విలువ రూ.2,74,85,912 కోట్లకు దిగజారగా, దీంతో ఇన్వెస్టర్లు రూ.5.15 లక్షల కోట్ల భారీ నష్టాన్ని చవిచూశారు. అలాగే  నేడు భారీ పతనం తరువాత ఈ లోటు మరింత పెరిగింది. 

బుధవారం 656 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్, నిఫ్టీలలో బలమైన క్షీణత కనిపించింది. కాగా సెన్సెక్స్ 783 పాయింట్లు నష్టపోయి 60 వేల స్థాయి దిగువన 59,971కి చేరుకుంది. దీనితో పాటు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 225 పాయింట్ల భారీ పతనం తర్వాత 18000 స్థాయి కంటే కిందకు పడిపోయింది. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌లో కొంత మెరుగుదల కనిపించి 656 పాయింట్లు నష్టపోయి 60,098 వద్ద ముగియగా, నిఫ్టీ 175 పాయింట్లు పతనమై 17,938 వద్ద ముగిసింది. 

click me!