అది నిజం కాదు ఫేక్; సోషల్ మీడియాలో వీరి ప్రీ వెడ్డింగ్ కార్డ్ వైరల్..

First Published | Jan 20, 2024, 3:30 PM IST

 భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి గతేడాది జనవరిలో నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి పెళ్లి ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అనంత్ అంబానీ చిన్న కొడుకు పెళ్లి ప్రీ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తమాషా ఏమిటంటే, ఈ ప్రీ వెడ్డింగ్ కార్డ్ నిజం కాదు  ఫేక్. 

anant ambani

మార్చి 1 నుంచి మార్చి 3 వరకు జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతాయని ఈ కార్డ్ లో చెబుతోంది. ఈ వైరల్ వెడ్డింగ్ కార్డ్ నిజం కాదని , ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గురించి ఎలాంటి అధికారిక ధృవీకరణ జరగలేదని అంబానీ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. అంబానీ కుటుంబం నుండి వచ్చిన నివేదిక ప్రకారం, వివాహ వేడుకలు చర్చనీయాంశంగా ఉన్నాయి, కానీ తేదీలు ఇంకా  ఖరారు కాలేదు.
 

జంగిల్ థీమ్ ప్రకారం ఈ ప్రీ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేయబడింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ పేర్లతో పాటు రాధిక మర్చంట్ తల్లిదండ్రుల పేరు కూడా కార్డులో ఉన్నాయి. 
 


అనంత్ అంబానీ నిశ్చితార్థం ముఖేష్ అంబానీ నివాసం అంటిలియాలో జరిగింది. రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త అండ్  ఎన్‌కోర్ హెల్త్‌కేర్ గ్రూప్ యజమాని వీరేన్ మర్చంట్ అండ్  శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌ను అనంత్ అంబానీ వివాహం చేసుకోనున్నారు. 

గతంలో అంబానీ కుటుంబంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో రాధిక చురుగ్గా ఉండేవారు. క్లాసికల్ డ్యాన్సర్ అయిన రాధిక న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్‌లో పట్టభద్రురాలైంది. 2017లో ఒక ప్రైవేట్ లగ్జరీ విల్లా చైన్ అయిన ఇస్ప్రవాలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసింది. 

Latest Videos

click me!