భారతదేశంలో, ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. అయితే జూన్ 2017కి ముందు, ప్రతి 15 రోజులకు ఒకసారి ధరల సవరణ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో పెట్రోల్ ధర 60 పైసలు, డీజిల్ ధర 59 పైసలు తగ్గగా మహారాష్ట్రలో పెట్రోల్ 39 పైసలు, డీజిల్ 38 పైసలు తగ్గాయి. హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, గోవాలలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధర 20 పైసలు పెరిగింది. పశ్చిమ బెంగాల్‌లో పెట్రోలు ధర 44 పైసలు, డీజిల్ ధర 41 పైసలు పెరిగింది. ఇవి కాకుండా తమిళనాడు, పంజాబ్, హర్యానా, గుజరాత్‌లలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మారాయి