ఐస్ క్రీమ్ కోన్ తయారీ బిజినెస్ ప్రారంభించేందుకు కొంత ప్లానింగ్, కమిట్‌మెంట్ కచ్చితంగా ఉండాలి. దీనిలో ప్రధానంగా రా మెటీరియల్స్, మెషీన్స్, మార్కెటింగ్, లైసెన్సులు వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. ముందుగా మీరున్న ప్రాంతంలో ఈ బిజినెస్ చేస్తున్న వారు ఎవరు? ఎలా నిర్వహిస్తున్నారు? లాభాల్లో నడుస్తోందా? తదితర విషయాలు తెలుసుకోవాలి. కస్టమర్ అవసరాలు తెలుసుకోవాలి. మార్కెట్ ధరలపై సర్వే చేయాలి.
* ముడి సరుకులు, ఖర్చులు ఇలా..
ఐస్‌క్రీమ్ కోన్లు, కప్పుల తయారీకి ముఖ్యంగా కావాల్సినవి మైదా, పంచదార, నెయ్యి, పాల ఉత్పత్తులు, ఫ్లేవర్ ఎసెన్సులు. వీటిని మార్కెట్‌లో బల్క్‌గా కొనుగోలు చేసుకోవాలి. దీని వల్ల పెట్టుబడి వ్యయం తగ్గుతుంది. కోన్లు, కప్పులు తయారు చేసిన తర్వాత ప్యాకేజింగ్ ఖర్చు సుమారు రూ.5 నుంచి రూ.15 వరకు ఉంటుంది. ఇవి కాకుండా కరెంట్, నీరు, కార్మికుల జీతాలు మొదలైన ఖర్చులుంటాయి.