వర్షాకాలంలో మీరు ఈ బిజినెస్‌లు చేస్తే డబ్బే డబ్బు

First Published | Sep 3, 2024, 4:40 PM IST

బిజినెస్‌ స్టార్ట్‌ చేయడం మీ కల? అయితే ఈ వర్షాకాలం మీకు మంచి అవకాశాలు ఇస్తోంది. ప్రజల అవసరాలు తెలుసుకొని, మీ తెలివి తేటలు ఉపయోగించి మీ బిజినెస్‌ను ప్రారంభించండి. తక్కువ పెట్టుబడితో రెయినీ సీజన్‌లో చేయగల బెస్ట్‌ బిజినెస్‌ ఐడియాలు మీకోసం ఇక్కడ ఉన్నాయి. వాటిని తెలుసుకోండి. హ్యాపీగా బిజినెస్‌ స్టార్ట్‌ చేసేయండి.
 
* రెయిన్‌కోట్‌లు, అంబ్రెల్లాల తయారీ, విక్రయం
వర్షాకాలం వచ్చిందంటే ముందుగా అందరికీ గుర్చొచ్చేది రెయిన్‌కోట్లు, గొడుగులు. ఇవి అవసరం లేని మనిషి ఉండడు కదా.. అందుకే వర్షాకాలంలో ఈ బిజినెస్‌ మీకు చక్కటి లాభాలనిస్తుంది. ఇందులో మీరు రెయిన్‌కోట్లు, గొడుగులను స్వయంగా తయారు చేసి మార్కెట్‌లో విక్రయించొచ్చు. లేదా హోల్‌సేల్‌లో కొని స్థానిక మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. 

 రెయిన్‌కోట్‌లు, అంబ్రెల్లాల వ్యాపారాన్ని మీరు కేవలం రూ.10 వేలు పెట్టి ప్రారంభించొచ్చు. విజయవాడ, హైదరాబాద్‌ వంటి పెద్ద నగరాల్లో హోల్‌సేల్‌ డీలర్లు ఉంటారు. వారి దగ్గరకు వెళ్లి సరకంతా ఒకే సారి కొనాలి. అప్పుడు తక్కువ ధరకు లభిస్తుంది. అలా తెచ్చిన గొడుగులు, రెయిన్‌కోట్లను స్థానిక మార్కెట్‌లో షాపులకు విక్రయించవచ్చు. దీని ద్వారా మీకు సుమారు 20 శాతం లాభాలు వస్తాయి. 

అదే మీకు మిషన్‌ కుట్టే పని వచ్చి ఉంటే మీరే గొడుగులు, రెయిన్‌కోట్లు తయారు చేసి విక్రయించవచ్చు. దీని ద్వారా మరిన్ని లాభాలు పొందవచ్చు. ముంబై, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో రెయిన్‌కోట్లు, గొడుగులకు సంబంధించిన రా మెటీరియల్‌ దొరుకుతుంది. వాటిని తెచ్చుకొని మీరే సొంతంగా తయారు చేసుకోవచ్చు. దీని వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. మీరు కాస్త పెద్ద స్థాయిలోనూ ఈ బిజినెస్‌ చేయవచ్చు. ఒక చిన్న కుటీర పరిశ్రమ కింద దీన్ని నిర్వహించవచ్చు. ఈ బిజినెస్‌ ద్వారా మీరు ఉపాధి పొందడమే కాకుండా మరో నలుగురికి పని కల్పించిన వారు కావచ్చు.  
 
* రెయినీ సీజన్‌ స్పెషల్‌ ఫుడ్ స్టాల్స్‌..
ఇన్‌స్టెంట్‌ లాభాలు కావాలంటే మీరు కచ్చితంగా ఫుడ్‌ బిజినెస్‌ పెట్టాలి. ముఖ్యంగా వర్షాకాలంలో చలి వాతావరణానికి అందరూ వేడివేడి ఫుడ్‌ తినడానికి ఇష్టపడతారు. మీకు వంట వస్తే బెటర్‌. లేకుంటే మంచి కుక్‌ను పెట్టుకొని వేడివేడి బజ్జీలు, పకోడీలు వంటి స్నాక్స్‌ ఐటమ్స్‌ తయారు చేసి విక్రయిస్తే మీరు లాభాలను ఆ రోజే చూస్తారు. 

దీనికోసం మీరు భారీగా పెట్టుబడి కూడా పెట్టక్కర్లేదు. జనాలు ఎక్కువగా తిరిగే ప్లేస్‌ చూసుకొని కేవలం రూ.లక్ష పెట్టుబడితో ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయవచ్చు. ఖర్చులు, లాభాలు లెక్కలేసుకొని అవసరాన్ని బట్టి పెట్టుబడి పెంచుకోవచ్చు. 
 
Latest Videos

* రూఫ్‌ క్లీనింగ్, మెయింటెనెన్స్ సర్వీసెస్..
వర్షాకాలంలో ఎక్కువ మంది ఫేస్‌ చేసే ప్రాబ్లమ్‌.. ఇళ్లు, కార్యాలయాలలో రూఫ్‌, గోడల నుంచి నీరు కారుతుండటం. దీంతో పాటు ప్లంబింగ్‌ పనులు కూడా ఎక్కువగా ఈ సమయంలోనే అవసరమవుతాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి క్లీనింగ్, మెయింటెనెన్స్ సర్వీసెస్‌ సెంటర్‌ పెడితే మీకు మంచి ఆదాయ మార్గం అవుతుంది.  

ఇది ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో మీకు బాగా వర్కౌట్‌ అవుతుంది.  ఇళ్లలో నీరు కారకుండా చేసే వర్క్‌ మీకొస్తే మీకు ఈ సీజన్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది. లేదంటే ఆ వర్క్‌ తెలిసిన వర్కర్లను పెట్టుకొని ఈ వ్యాపారాన్ని స్టార్ట్‌ చేయవచ్చు. ఈ బిజినెస్‌ సక్సెస్‌ అవ్వాలంటే వ్యాపార ప్రకటనలు ఇవ్వడం చాలా కీలకం. ఆన్‌లైన్‌ యాడ్స్‌ ఇవ్వడం, పామ్లెట్స్‌ పంచడం వంటివి చేయాలి. మీకు వర్క్‌ వచ్చుంటే పెట్టుబడి లేకుండానే ఈ బిజినెస్‌ ప్రారంభించవచ్చు. లేదా నలుగురు వర్కర్లను పెట్టుకొని వారికి జీతాలు ఇస్తూ మెయిన్‌టెయిన్‌ చేయవచ్చు.  
 
* ప్రత్యేక మొక్కల విక్రయం, గార్డెనింగ్
మొక్కలు పెంపకానికి సరైన సమయం వర్షాకాలం. ఈ సీజన్‌లో ఏ రకమైన మొక్కైనా ఈజీగా బతుకుతుంది. ఇదే అంశాన్నీ మీరు బిజినెస్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు. మీ ప్రాంతంలో నర్సరీ పెట్టడం ద్వారా మీరు మొక్కలు విక్రయించొచ్చు. అదేవిధంగా నలుగురు వర్కర్స్‌ను పెట్టి ట్రాలీల్లాంటి వాహనాల్లో మొక్కలు పెట్టి ఆయా కాలనీలు, ఊర్లకు తీసుకెళ్లి విక్రయించొచ్చు. ఇది కూడా తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్‌. మీకు సొంతంగా స్థలం, షెడ్‌ ఉంటే కేవలం మొక్కల కొనుగోలుకు అవసరమైన డబ్బు పెట్టుబడిగా పెడితే సరిపోతుంది. ఈ రకంగా రూ.లక్షతో కూడా ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయవచ్చు. 
 
click me!