రూ.20 వేల లోపు బెస్ట్ గేమింగ్ మొబైల్ ఫోన్లు ఇవిగో..

Published : Dec 08, 2024, 03:40 PM IST

మీకు గేమ్స్ అంటే బాగా ఇష్టమా? మీ మొబైల్ లో తరచూ ఆడుతూ ఉంటారా?  అయితే బెస్ట్ గేమింగ్ మొబైల్ ఫోన్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ ఫోన్ల ధరలు రూ. 20 వేల లోపే ఉంటాయి.   

PREV
15
రూ.20 వేల లోపు బెస్ట్ గేమింగ్ మొబైల్ ఫోన్లు ఇవిగో..

2024 ముగిసిపోతోంది. కొత్త సంవత్సరంలో మొబైల్ ధరలు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక పరిస్థితుల కారణంగా మొబైల్ ధరలు పెరగచ్చు లేదా తగ్గొచ్చు. అందువల్ల ఈ డిసెంబర్ ముగిసే లోపు మంచి గేమింగ్ మొబైల్ ను మీరు కొనుగోలు చేయండి. రూ.20,000లోపు లభించే ఉత్తమ గేమింగ్ మొబైల్ ఫోన్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓ సారి మీరూ చెక్ చేయండి. 

25

Poco X6 Pro

Poco X6 Pro 120Hz రిఫ్రెష్ రేట్, 1800 nits మాక్సిమం బ్రైట్ నెస్ తో లభిస్తుంది. ఇది 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 8300 Ultra SoCతో పాటు Mali-G615 GPUతో రన్ అవుతుంది. అందువల్ల గ్రాఫిక్స్ టాస్క్‌లను సులువుగా హాండిల్ చేయగలదు. అందువల్ల మీరు ఎలాంటి గేమ్స్ ఆడినా ఎంజాయ్ చేస్తారు. 

35

iQOO Z9

iQOO Z9 మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది శక్తివంతమైన రంగులు, ఫ్లూయిడ్ విజువల్స్‌ను అందిస్తుంది. వెనుక కెమెరా సెటప్‌లో 2MP, 50MP సెన్సార్ లతో లింకై ఉంటాయి. అయితే ముందు భాగంలో సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉపయోగించారు. 8 GB RAM, 128GB అంతర్గత నిల్వతో iQOO Z9 ఫోన్ యాప్‌లు, మీడియా కోసం అవసరమై స్పేస్ అందిస్తుంది. ఇందులో ఉన్న 5000 mAh బ్యాటరీ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ చేసేలా పనిచేస్తుంది. Android v14తో ఈ ఫోన్ పనిచేస్తుంది. అందువల్ల ఈ మొబైల్ మంచి గేమింగ్ ప్లాట్ ఫాం ను అందిస్తుంది. ఇది డ్యూయల్ 5G SIM కార్డ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.

45

Realme Narzo 70 Turbo

Realme Narzo 70 Turbo 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 2,000 nits మాక్సిమం బ్రైట్ నెస్ తో పనిచేస్తుంది. ఇది MediaTek డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అంతేకాకుండా  Mali G615 MC2 GPUతో జత చేసి ఉంటుంది. అందువల్ల 3డీ కాన్ఫిగరేషన్ ఉన్న గేమ్స్ ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.  ఇది LPDDR4X RAM, UFS 3.1 స్టోరేజ్‌ను కలిగి ఉంది. 
 

55

OnePlus Nord CE 4 Lite

1,080 x 2,400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED స్క్రీన్ ను కలిగిన OnePlus Nord CE 4 Lite 5G ఫోన్ గేమింగ్ పర్పస్ కి చక్కటి ఎంపిక. ఇది 120 Hz వరకు రిఫ్రెష్ రేట్, 2,100 nits మాక్సిమం బ్రైట్ నెస్ కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 695 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. Adreno 619 GPU, 8GB LPDDR4X RAM, 256 GB ఇంటర్నల్ మెమొరీ కలిగిన ఈ ఫోన్ గేమ్స్ ఆడేవారికి చాలా మంచి ఎంపిక. 

ఈ ఫోన్ 5,500 mAh బ్యాటరీ, 80W వైర్డ్ Super VOOC ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తూ పనిచేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi 5, GPS, బ్లూటూత్ 5.1, USB టైప్-C ఉన్నాయి.  

click me!

Recommended Stories