ఎక్కువ యాడ్స్ లేకుండా వీడియోస్ చూడాలంటే ఈ యాప్ ట్రై చేయండి

Published : Dec 08, 2024, 01:25 PM IST

ఎక్కువ యాడ్స్ లేకుండా వీడియోస్ చూడాలని ఉందా? అయితే మీకు ఈ యాప్ కచ్చితంగా నచ్చుతుంది.  ఇందులో మీరు ప్రకటనల వల్ల విసుగు చెందడం లాంటి ఇబ్బందులు ఉండవు. ఇంటరెస్టింగ్ విషయం చూస్తున్నప్పుడు యాడ్స్ వచ్చి మూడ్ చెడగొట్టడం లాంటివి అస్సలు జరగవు. ఆ యాప్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.   

PREV
15
ఎక్కువ యాడ్స్ లేకుండా వీడియోస్ చూడాలంటే ఈ యాప్ ట్రై చేయండి

ఈ కాలంలో ఏ చిన్న విషయం తెలుసుకోవాలన్నా గూగుల్‌ చేయడం మనందరికీ అలవాటే కదా.. అదే మీరు తెలుసుకోవాలనుకున్న విషయాన్ని వీడియో రూపంలో చూడాలంటే వెంటనే యూట్యూబ్‌ తెరిచి చెక్ చేస్తుంటాం. ప్రతి భాషలోనూ యూట్యూబ్‌ వీడియోలు అందుబాటులో ఉండటంతో చాలా మంది యూట్యూబ్‌నే ఎక్కువగా ఉపయోగిస్తారు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ వినియోగించే వారు కోట్లలో ఉన్నారు. అందువల్ల యూట్యూబ్ యాజమాన్యం ప్రతి వీడియోలో యాడ్స్ ప్లే చేస్తూ డబ్బులు సంపాదించుకుంటోంది. 

25

యూట్యూబ్ యాజమాన్యానికి ఆదాయం సంగతి ఎలా ఉన్నా వీడియోలు చూసే వారికి మాత్రం మధ్యలో వచ్చే యాడ్స్ చాలా విసుగు తెప్పిస్తాయి. మంచి ఇంటరెస్టింగ్ విషయం చూస్తున్నప్పుడు సడన్ గా వచ్చే యాడ్స్ వల్ల చాలా అసహనం కలుగుతుంది. ఒక్కోసారి కోపం కూడా వస్తుంది. అయితే కాస్త మంచి విషయం ఏమిటంటే skip చేసే ఆప్షన్ ఇవ్వడం. వీడియో మధ్యలో ప్లే అవుతున్న వీడియో నచ్చిన వారు ఆ వీడియో పూర్తి వరకు చూస్తారు. మరి నచ్చని వారు చూడకుండా ఉండటం కోసం స్కిప్ ఆప్షన్ ఇస్తున్నారు. అయితే ఇటీవల యూట్యూబ్ ఒకేసారి రెండు యాడ్స్ ఇవ్వడం ప్రారంభించింది. దీంతో ఒకటి స్కిప్ చేసినా, రెండోది పూర్తిగా చూడాల్సి వస్తోంది. 

35

ఈ యాడ్స్ రాకుండా మీరు యూట్యూబ్ వీడియోలు చూడాలనుకుంటే ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్ యాజమాన్యం స్టూడెంట్‌, ఫ్యామిలీ, ఇండివిడ్యువల్‌ ఇలా అన్ని విభాగాల్లో  సబ్‌స్క్రిప్షన్ రేట్లు పెంచేసింది. యూట్యూబ్ ప్రీమియం నెలవారీ విద్యార్థి ప్లాన్ 12.6 శాతం ధర పెంచారు. దీంతో రూ.79 ఉండే ఈ ప్లాన్‌ ఇప్పుడు రూ.89 అయ్యింది. వ్యక్తిగత(పర్సనల్‌) నెలవారీ ప్లాన్ 15 శాతం ధర పెంచారు. రూ.129 ఉండే ఈ ప్లాన్‌ రూ.149కి పెరిగింది. నెలవారీ ఫ్యామిలీ ప్లాన్ రూ. 189 ఉండగా, పెరిగిన ధరలతో రూ. 299 చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ యాప్‌ ఇన్‌స్టాల్ చేసుకుంటే యాడ్స్ లేకుండా వీడియోలు చూడొచ్చు. 

45

ఆ యాప్ పేరు Brave Fast Private Browser. ఆ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే యాడ్స్ లేకుండా వీడియో చూడటమే కాకుండా picture in picture మోడ్ లో కూడా చూడొచ్చు. అంతేకాకుండా లాక్ స్క్రీన్ లో కూడా వీడియోను ఎంజాయ్ చేయొచ్చు. ఆ యాప్ ఆండ్రాయిడ్ మొబైల్స్ లోనే కాకుండా, ఐఫోన్ లోనూ వర్క్ అవుతుంది. 

55

Brave Browser యాప్ ఉపయోగించి యాడ్స్ లేకుండా వీడియోలు చూడాలంటే ఇలా చేయండి. 
ముందుగా ప్లేస్టోర్ లోకి వెళ్లి సెర్చ్ లో brave browser అని టైప్ చేసి యాప్ ను ఇన్ స్టాల్ చేయండి. 

సెట్టింగ్స్ లోకి వెళ్లి, మీడియా ఆప్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ లో బ్యాగ్రైండ్ ప్లేను ఆన్ చేయండి.

ఇప్పుడు Brave Browser యాప్ లో వీడియో ఆప్షన్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్ లో మీకు కావాల్సిన వీడియో గురించి టైప్ చేసి ప్లే చేయండి. దీంతో యాడ్స్ లేకుండా మీరు వీడియోస్ ను ఎంజాయ్ చేయొచ్చు. 

Note: ఏదైనా యాప్ మీరు ఇన్ స్టాల్ చేయాలనుకుంటే మీ డేటా సెక్యూరిటీ గురించి పర్మీషన్స్ ఇవ్వడంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ డాటాకు మీదే బాధ్యత అని మర్చిపోవద్దు.

click me!

Recommended Stories