Top SUVs: కార్లంటే ఇవే.. అమ్మకాల్లో టాప్.. వినియోగదారులకు ఫేవరెట్

Published : Feb 22, 2025, 06:01 PM IST

Top SUVs: ఇండియాలో ప్రస్తుతానికి ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ మోడల్ కార్లు ఏంటో మీకు తెలుసా? జనవరి నెలలో ఈ కార్లే ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. మీరు గాని కారు కొనే ఆలోచనలో ఉంటే ఈ డేటా మీకు ఉపయోగపడుతుంది. బెస్ట్ సెల్లింగ్ కార్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 

PREV
15
Top SUVs: కార్లంటే ఇవే.. అమ్మకాల్లో టాప్.. వినియోగదారులకు ఫేవరెట్

సాధారణంగా SUV కార్లు ఎక్కువగా సేల్ అవుతాయి. జనవరి సేల్స్ రిపోర్ట్ ఇదే చెబుతోంది. ఈ డేటా ప్రకారం ఎక్కువగా సేల్ అవుతున్న టాప్ SUV మోడల్ కార్ల గురించి తెలుసుకుందాం. ఈ కార్లే ఎందుకు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి, వాటి ఫీచర్స్, తదితర వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం. 

25

హ్యుందాయ్ క్రెటా

లాస్ట్ జనవరిలో ఈ కారు 18,522 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు క్రెటాకు ఇదే బెస్ట్ సేల్స్. ఇప్పటి వరకు ఇండియాలో బాగా అమ్ముడయ్యే SUV కారు ఇదే. హ్యుందాయ్ తన కొత్త ఎలక్ట్రిక్ మోడల్ సేల్స్ పెంచింది. ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ వెేరియంట్సే టాప్ లో ఉన్నాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్

బాలెనోతో పోలిస్తే ఫ్రాంక్స్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. దీని డిజైన్ వల్ల బాగా అమ్ముడవుతోంది. జవవరిలో 15,192 యూనిట్లు అమ్ముడయ్యాయి. 1.2 లీటర్ పెట్రోల్ మోడల్ బెస్ట్ గా నిలిచింది. దీనికి టర్బో వేరియంట్ కూడా ఉంది.

35

టాటా పంచ్

పంచ్ SUV కూడా వినియోగదారులకు బాగా నచ్చిన కారు. ఇది టాటా ప్రోడక్ట్స్ లో బెస్ట్ సేల్స్ ఉన్న కారు పంచ్. ఇది జనవరిలో 16,231 యూనిట్లు అమ్ముడైంది. ఫ్యూయల్ వేరియంట్‌తో పాటు CNG కూడా ఎక్కువగా సేల్ అవుతోంది. 

టాటా నెక్సాన్

పంచ్ తర్వాత నెక్సాన్ బెస్ట్ సబ్ SUV. మార్కెట్ పోటీ ఎక్కువగా ఉన్నా నెక్సాన్ బాగా అమ్ముడవుతోంది. నెక్సాన్ 15,397 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని డిజైన్, ఫీచర్స్ వల్ల ఇది పాపులర్ అయ్యింది. ఇందులో కూడా CNG వెర్షన్ ఉంది.

45

మారుతి గ్రాండ్ విటారా

జనవరి నెలలో 15,784 యూనిట్లు అమ్ముడయ్యాయంటే గ్రాండ్ విటారాకు ఎంత క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కియా సెల్టోస్ కంటే విటారా ఎక్కువ అమ్ముడైంది. దీనికి డీజిల్, టర్బో పెట్రోల్ ఇంజన్ లేకపోయినా బాగా అమ్ముడవుతుండటం విశేషం. ఇందులో హైబ్రిడ్ మోడల్ కు మంచి డిమాండ్ వచ్చింది. 

55

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా కంపెనీ నుంచి ఎన్ని కొత్త మోడల్స్ వస్తున్నా స్కార్పియోకు ఉన్న క్రేజ్, డిమాండ్ తగ్గలేదు. ఇప్పటికీ మహీంద్రాలో ఎక్కువగా అమ్ముడవుతున్న మోడల్స్ లో స్కార్పియో టాప్ లో ఉంటుంది. జనవరిలో స్కార్పియో N మోడల్ కార్లు 15,442 అమ్ముడయ్యాయి. స్కార్పియో N సైజు, లుక్ వల్లే ఈ వెర్షన్ సక్సెస్ అయింది.

 

click me!

Recommended Stories