దేశంలో టాప్ 5 రిచ్చెస్ట్ ట్రైన్స్ ... కేవలం వీటితోనే రైల్వేకు ఎంత ఆదాయమో తెలుసా?

First Published Sep 16, 2024, 9:08 PM IST

సామాన్యులకు గమ్యస్థానాలకు చేర్చే భారతీయ రైల్వే అసమాన్యమైనది. మన రైల్వేస్ లో ఏడాదికి వందకోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే రేళ్ళు కూడా వున్నాయి. అవేంటో చూద్దాం.

Indian Railway

ఇండియన్ రైల్వేస్ ... ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ప్రజా రవాణా వ్యవస్థ. ఇలా శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన భారతీయ రైల్వే ప్రజలకు ఎంతో చేరువయ్యింది. చాలామందికి రైలులో వెళ్ళడం కేవలం ప్రయాణమే కాదు... ఓ ఎమోషన్. భారతీయుల జీవితంలో భాగమైన రైల్వే దేశ ఆర్థిక వ్యవస్థలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణాకు కూడా చేపడుతుంది ఇండియన్ రైల్వేస్.
 

Indian Railway

మిగతా రవాణా వ్యవస్థలతో పోలిస్తే రైలులో ప్రయాణం సౌకర్యవంతం, సురక్షితమే కాదు చవక కూడా. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా రైళ్లనే ఆశ్రయిస్తారు... ఇలా సామాన్యుల ప్రయాణ సాధనంగా మారిపోయాయి. ఆడా మగ, కులమత, ప్రాంతీయ బేధాలను  ఎరగదు...తనను ఆశ్రయించేవారిని గమ్యస్థానాలకు చేర్చడమే రైలు పని. అందువల్లే వందల ఏళ్ళయినా రైల్వేస్ ప్రతిష్ట ఏమాత్రం తగ్గడంలేదు. 

అయితే పేదలకు చేరువైన ఈ రైల్వే కూడా పేదదే అనుకుంటే పొరబడినట్లే. మన ఇండియన్ రైల్వేస్ బాగా రిచ్చే. రైల్వేలకు ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 లో ఏకంగా రూ.2,62,200 కోట్లను కేటాయించారంటేనే ఎంత రిచ్చో అర్థం చేసుకోవచ్చు. 

మన రైల్వేలో వందలకోట్లు సంపాదించే రైళ్లు కూడా వున్నాయి. ఇలా భారతీయ రైల్వేకు కొన్ని రైళ్ల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుంది. అలాంటి టాప్ 5 రైళ్ల గురించి తెలుసుకుందాం. 

Latest Videos


Bangalore Express

1.బెంగళూరు రాజధాని ఎక్స్ ప్రెస్ : 

కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి దేశ రాజధాని న్యూడిల్లీ మధ్య నడిచే రైలు. ఈ రైలు 2,367 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే ఈ ట్రైన్ లో నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు... దీంతో అత్యంత రద్దీగా వుంటుంది. అత్యధిక మంది ప్రయాణిస్తున్నారంటే అత్యధిక ఆదాయం వస్తున్నట్లే. 

ట్రైన్ నంబర్  22692 బెంగళూరు రాజధాని ఎక్స్ ప్రెస్ లో 2022-23 సంవత్సరంలో  ఏకంగా 5,09,510 మంది ప్రయాణించారు. దీంతో దాదాపు రూ.176 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ రైలు ప్రయాణం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మీదుగా సాగుతుంది.  

Indian Railway

2. సీల్దా రాజధాని ఎక్స్ ప్రెస్ : 

దేశ రాజధాని న్యూడిల్లీ, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా మధ్య నడిచే రైలు 12314 సిల్దా ఎక్స్ ప్రెస్. ఈ రైలు కూడా దేశంలో అత్యంత రద్దీగా వుండే రైళ్లలో ఒకటి. 2022-23 సంవత్సరంలో ఈ రైలులో 5,09,164 మంది ప్రయాణించారు. తద్వారా రూ.128 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.  

3. దిబ్రూఘర్ ఎక్స్ ప్రెస్ : 

అస్సాంలోని దిబ్రూఘర్ నుండి న్యూడిల్లీకి నడిచే ట్రైన్ ఇది. ఈ రైలు గత ఏడాది ఏకంగా నాలుగు లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. దీంతో రూ.126 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. 
 

Indian Railway

4. ముంబై తేజస్ రాజధాని ఎక్స్ ప్రెస్ : 

మహారాష్ట్ర రాజధాని ముంబై సెంట్రల్ నుండి న్యూడిల్లీకి నడిచే ట్రైన్ ఇది. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరాల మధ్య ప్రయాణించే రైలు కావడంతో అత్యధికమంది ప్రయాణిస్తూ వుంటారు. ఇలా గతేడాది 4,85,794 మంది ప్రయాణించగా రూ.122 కోట్ల ఆదాయం సమకూరింది. 

5. దిబ్రూఘర్ రాజధాని ఎక్స్ ప్రెస్ : 

అస్సాంలోని దిబ్రూఘర్ నుండి న్యూడిల్లీకి అనేక రైలు నడుస్తుంటారు. ఈ రూట్ లో నడిచే అన్నిరైళ్లు ఇంచుమించు రద్దీగానే వుంటాయి. కాబట్టి ఆదాయం కూడా అదేస్థాయిలో వస్తుంది.  

దిబ్రూఘర్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో గతేడాది 4,20,215 మంది ప్రయాణించారు. దీంతో రైల్వేకు రూ.116 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. 

click me!