వింటేజ్ నుంచి సూపర్‌కార్ల వరకు: అత్యంత ఖరీదైన టాప్-5 కార్లు

First Published | Sep 10, 2024, 5:42 PM IST

Top 5 Most Expensive Cars : కొన్ని కార్లు, వాటి పరిమిత ఉత్పత్తి, క్లాసిక్ డిజైన్, విలాసవంతమైన లక్షణాలతో వాటి వయస్సు పెరిగిన తర్వాత కూడా వేలంలో భారీ ధరను పలుకుతుంటాయి.  వింటేజ్ నుంచి సూపర్‌కార్ల వరకు వేలంలో అత్యంత ఖరీదైన టాప్-5 కార్ల వివరాలు గమనిస్తే ఇలా ఉన్నాయి. 

1955 మెర్సిడెస్-బెంజ్ 300 SLR ఉహ్లెన్‌హాట్ కూపే

1955 మెర్సిడెస్-బెంజ్ 300 SLR ఉహ్లెన్‌హాట్ కూపే వేలంలో అమ్ముడైన అత్యంత ఖరీదైన కారు. మే 2022లో జర్మనీలోని స్టట్‌గార్ట్‌లోని మెర్సిడెస్-బెంజ్ మ్యూజియంలో జరిగిన వేలంలో $142 మిలియన్లకు అమ్ముడైంది.

Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe అనేది ప్రపంచంలోని అత్యంత విలువైన, అందమైన కారుగా గుర్తింపు పొందింది. దాని వివరాలు గమనిస్తే.. 300 SLR Uhlenhaut Coupe అనేది 1950ల మధ్యలో Mercedes-Benz డెవలప్ చేసిన లిమిటెడ్ ఎడిషన్ కారు. ఇది "Uhlenhaut Coupe" అనే పేరు Hermann Uhlenhaut అనే Mercedes-Benz ప్రముఖ ఇంజనీరును స్మరించడానికి పెట్టారు. 

డిజైన్ విషయానికి వస్తే డిజైన్ అత్యంత సౌందర్యం, అద్భుతమైన లుక్ ను కలిగి ఉంటుంది. ఇన్లైన్ 8 సిలిండర్ ఇంజిన్, "స్వింగ్-ఆవుట్" డోర్లు ఉన్నాయి. ిది 3.0 లీటర్ ఇంజిన్ కలిగి ఉంది. 295 hp (220 kW) అత్యంత శక్తివంతమైన, వేగవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. 300 km/h (186 mph) వరకు వేగం అందుకుంటుంది.

1962 ఫెరారీ 330 LM 250 GTO

1962 ఫెరారీ 330 LM / 250 GTO స్కాగ్లియెట్టి నవంబర్ 2023లో న్యూయార్క్ నగరంలో జరిగిన RM సోథెబీ వేలంలో $51,705,000కి అమ్ముడైంది. Ferrari 330 LM అనేది Ferrari 250 GTO అప్ గ్రేట్ వెర్షన్. దీనిని 1963లో అభివృద్ధి చేశారు. సీటింగ్ ప్లాన్, టెక్నాలజీ పరంగా అద్భుతంగా ఉంటుంది. 

330 LMలో 4.0 లీటర్ V12 ఇంజిన్ తో సుమారు 300 hp (224 kW) శక్తిని పొందుతుంది. ఎక్కువగా రేసింగ్ కోసం అభివృద్ధి చేశారు. ఇది లిమిటెడ్ ఎడిషన్ లో వచ్చింది. కొన్నింటినీ మాత్రమే తయారు చేశారు.


1962 ఫెరారీ 250 GTO

1962 ఫెరారీ 250 GTO కారు 2018లో RM సోథెబీ వేలంలో $48.4 మిలియన్లకు అమ్ముడైంది. 1962 Ferrari 250 GTO అనేది క్లాసిక్, చరిత్రాత్మకంగా ముఖ్యమైన స్పోర్ట్స్ కారు. ఇది Ferrari  అత్యంత ప్రఖ్యాతి కలిగిన మోడళ్లలో ఒకటి. 

మార్కెటింగ్ లో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ కారు 1960లలో Ferrari మోటార్ స్పోర్ట్స్‌లో విజయాలను పెంచడానికి రూపొందించబడింది. దాని దృఢమైన నిర్మాణం, శక్తివంతమైన ఇంజిన్, గణనీయమైన డిజైన్ ఇప్పుడు మోటార్ రేసింగ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.
 

1962 ఫెరారీ 250 GTO

2014లో, కాలిఫోర్నియాలోని కార్మెల్‌లోని బోన్హామ్స్ క్వాయిల్ లాడ్జ్ వేలంలో ఎవరో 1962 ఫెరారీ 250 GTO కారును $38,115,000కి కొనుగోలు చేశారు.

1957 ఫెరారీ 335 S

1957 ఫెరారీ 335 S స్పైడర్ స్కాగ్లియెట్టి ఫిబ్రవరి 2016లో పారిస్‌లో జరిగిన వేలంలో $35.7 మిలియన్లకు అమ్ముడైంది. 1957 Ferrari 335 S అనేది మోటారింగ్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన కారు, ఇది పలు ప్రముఖ రేసింగ్ ఈవెంట్లలో పాల్గొంది.

1957 Ferrari 335 S అనేది 1950ల మధ్యలో రూపొందించిన అత్యంత శక్తివంతమైన, అందమైన స్పోర్ట్స్ కారు. ఇది ఇంజిన్ శక్తి, డిజైన్, రేసింగ్ విజయాలతో మోటారింగ్ చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది.

Latest Videos

click me!