1. కంటెంట్ క్రియేషన్
మీరు గాని Jasper AI, Copy.ai, Writesonic టూల్స్ నేర్చుకుంటే బ్లాగ్ పోస్టులు, ఆర్టికల్స్, సోషల్ మీడియా కంటెంట్ ను క్రియేట్ చేయవచ్చు. అది కూడా బెస్ట్ క్వాలిటీతో కంటెంట్ తయారు చేయవచ్చు. ఈ టూల్స్ నేర్చుకున్న వారు డిజిటల్ మార్కెటర్లుగా, బ్లాగర్లుగా జాబ్ చేయొచ్చు. మార్కెట్లో కంటెంట్ క్రియేటర్స్ కి మంచి డిమాండ్ ఉంది.
2. గ్రాఫిక్ డిజైన్
Canva, ArtSmart, Adobe Firefly వీటిల్లో ఏ AI టూల్ నేర్చుకున్నా మీరు వివిధ ప్లాట్‌ఫారమ్ లకు ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ డిజైన్ చేయొచ్చు. ఈ టూల్స్ ఉపయోగించి సోషల్ మీడియా పోస్టులు, మార్కెటింగ్ మెటీరియల్స్ రూపొందించవచ్చు. ఈ టూల్స్ నేర్చుకున్న వారు చిన్న వ్యాపారాలకు, మార్కెటర్లకు, ఇన్‌ఫ్లుఎన్సర్లకు పోస్టులు క్రియేట్ చేసి ఇవ్వొచ్చు. సోషల్ మీడియా పోస్టుల క్రియేటర్స్ కి బాగా డిమాండ్ ఉంది. వీటిని ఉపయోగించే వారి డిమాండ్ కు అనుగుణంగా మీరు ఛార్జ్ తీసుకోవచ్చు.
3. వీడియో ప్రొడక్షన్
Pictory, Lumen5, InVideo టూల్స్ నేర్చుకుంటే యూట్యూబ్, ఇన్‌స్టా వంటి ప్లాట్‌ఫారమ్ లకు వీడియోలను సృష్టించి ఎడిట్ చేయవచ్చు. ఈ AI టూల్స్ నేర్చుకున్న వారు కంటెంట్ క్రియేటర్లుగా, బిజినెస్, ఎడ్యుకేటర్లుగా రాణించవచ్చు. ప్రమోషనల్ వీడియోలు, ఎడ్యుకేషనల్ కంటెంట్ రూపొందించడానికి ఈ AI టూల్స్ ఉపయోగపడతాయి.
4. వాయిస్ ఓవర్ సర్వీసెస్
Murf AI, Descript, Resemble AI టూల్స్ ద్వారా వీడియోలు, ప్రకటనలు, ఆడియోబుక్స్ కోసం వాయిస్ ఓవర్ సేవలను అందించడం లాంటి వర్క్స్ చేయొచ్చు. వీడియో ప్రొడ్యూసర్లు, పోడ్కాస్టర్‌లు, రచయితలకు ఈ AI టూల్స్ అవసరం ఉంటుంది.
5. భాషా అనువాదం
DeepL, Google Translate, Microsoft Translator టూల్స్ నేర్చుకుంటే మీకు గ్లోబల్ వైజ్ వర్క్స్ దొరుకుతాయి. అంటే ఏ భాషలో ఉన్న కంటెంట్ అయినా మీరు ఏ భాషలోకైనా ట్రాన్సలేట్ చేసేయొచ్చు. గ్లోబల్ బిజినెస్‌లు, పబ్లిషర్లకు ఈ టూల్స్ అవసరం ఉంటుంది. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న ఈ AI టూల్స్ మీరు నేర్చుకుంటే మీరు ఊహించిన డబ్బుకంటే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు.
6. SEO ఆప్టిమైజేషన్
Surfer SEO, Scalenut, Clearscope టూల్స్ బ్లాగ్ పోస్టులను, వెబ్‌సైట్ కాపీని SEO కోసం ఆప్టిమైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ టూల్స్ నేర్చుకున్న వారికి వెబ్‌సైట్ కంటెంట్‌ను సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్‌లో పైన ఉండేలా మెరుగుపరచగలరు. ఈ టూల్స్ నేర్చుకున్న వారిని కార్పొరేట్ కంపెనీలు పిలిచి మరీ జాబ్స్ ఇస్తాయి. అయితే మీరు ఈ టూల్స్ ఉపయోగించడంలో స్పెషలిస్టు అయి ఉండాలి.
7. చాట్‌బాట్ డెవలప్‌మెంట్
ChatGPT API, Dialogflow, Microsoft Bot Framework టూల్స్ ఉపయోగించి కస్టమర్ సర్వీస్ చేయొచ్చు. AI ఆధారిత చాట్‌బాట్‌లను రూపొందించవచ్చు. ఈ-కామర్స్, కస్టమర్ సపోర్ట్, SaaS వంటి ఫీల్డ్స్ లో ఈ టూల్స ఎక్కువగా ఉపయోగిస్తారు.
8. విద్యా కంటెంట్ సృష్టించడం
Udemy, Teachable, Coursera టూల్స్ నేర్చుకుంటే మీరు చదువుకు సంబంధించిన కంటెంట్ క్రియేటర్స్ గా పనిచేయొచ్చు. ఈ టూల్స్ ఉపయోగించి ట్యుటోరియల్స్, ఆన్‌లైన్ కోర్సులను అభివృద్ధి చేయొచ్చు. ఎడ్యుకేటర్లు, ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌లు ఉపయోగించే వారికి ఆన్‌లైన్ కోర్సులు, విద్యా వీడియోలు రూపొందించడానికి ఈ టూల్స్ బాగా ఉపయోగపడతాయి.
9. సోషల్ మీడియా మేనేజ్‌మెంట్
Hootsuite, Buffer, Sprout Social టూల్స్ నేర్చుకున్న వారు సోషల్ మీడియా అకౌంట్లను మరింత మెరుగ్గా నిర్వహించవచ్చు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుఎన్సర్లు ఎక్కువగా ఈ టూల్స్ వాడతారు. మీరు సొంతంగా సోషల్ మీడియా అకౌంట్లు నిర్వహిస్తున్నా, లేదా అలాంటి వారి అకౌంట్స్ నిర్వహించాలన్నా ఈ టూల్స్ ఉపయోగించి డబ్బులు ఎక్కువ సంపాదించండి.
10. ఆటోమేటెడ్ ట్రేడింగ్
MetaTrader, QuantConnect, Alpaca ఈ టూల్స్ ఫైనాన్షియల్ సెక్టార్ లో బాగా ఉపయోగపడతాయి. మార్కెట్లో AI అల్గోరిథమ్‌లను ఉపయోగించి లావాదేవీలను నిర్వహించడానికి ఈ టూల్స్ బాగా ఉపయోగపడతాయి. వ్యక్తిగత ట్రేడర్లు, ఇన్వెస్ట్‌మెంట్ ఫర్మ్‌లు వీటిని ఉపయోగిస్తాయి. అందువల్ల మీరు ఈ టూల్స్ నేర్చుకుంటే అలాంటి సంస్థల్లో పనిచేయొచ్చు.