ఒకప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు.. నేడు రియల్ ఎస్టేట్ కింగ్.. ఒకే గదిలో ఉంటున్న కోటీశ్వరుడి సక్సెస్ స్టోరీ !

ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కలలు కంటారు. కానీ వారి కల సాకారం కావాలంటే ఏం చేయాలో తెలియదు. కొంతమంది ధనవంతులు నేటి యువ ఔత్సాహికులకు కొన్ని  టిప్స్ ఇస్తుంటారు. ఇవి పాటిస్తే మీరు కూడా కోటీశ్వరులు అవుతారనడంలో సందేహం లేదు. 
 

This is the success story of a millionaire living in a room!khow how and what was it-sak

ఏ మనిషి చిటికెలో ధనవంతుడు కాలేడు. ప్రతి వ్యక్తి సక్సెస్ వెనుక కష్టాలు, బాధలు, పోరాటం ఉంటాయి. చాలా కష్టపడితే ఆ దశకు చేరుకుంటారు. చాలా మంది సక్సెస్ ఫుల్ వ్యక్తులు వారి జీవిత కథను చెబుతుంటారు. నేటి యువతకి వారి  విజయానికి అనుసరించిన మార్గమేమిటో చెబుతూ సహాయం చేస్తుంటారు. వారిలో 86 ఏళ్ల బిల్ కమ్మింగ్స్ కూడా ఉన్నారు. బిల్ కమ్మింగ్స్ అమెరికాలో నివసిస్తున్న బిలియనీర్. తన సక్సెస్ ఉన్న వెనుక రహస్యాన్ని బయటపెట్టాడు. అతను 50 సంవత్సరాల క్రితమే తన బిలియన్ డాలర్ల కంపెనీని ప్రారంభించాడు. ఇప్పుడు బిల్ కమ్మింగ్స్ బోస్టన్ రియల్ ఎస్టేట్ రాజు.
 

This is the success story of a millionaire living in a room!khow how and what was it-sak

86 ఏళ్ల వయసులో కూడా బిల్ కమ్మింగ్స్ ఆగిపోలేదు. తన రంగంలో విజయాన్ని కొనసాగిస్తున్న బిల్ కమ్మింగ్స్ ఒక పుస్తకం కూడా రాశారు. తన విజయానికి కారణమేమిటో నేటి యువతకు తెలుస్తుందని, దానిని వారు కూడా పాటించాలనే ఉద్దేశంతో బిల్ కమ్మింగ్స్ ఓ పుస్తకం రాస్తున్నారు. 
 


బిల్ కమ్మింగ్స్ జీవితం ? : 

బిల్ కమ్మింగ్స్ పుట్టుకతో బిలియనీర్ కాదు. అతని జీవితం అంత లగ్జరీగా ఉండేది కూడా కాదు. బిల్ కమ్మింగ్స్ ఒకప్పుడు తన సోదరి అండ్ తల్లిదండ్రులతో కలిసి ఒకే గది ఇంట్లో నివసించేవాడు. దశాబ్దాల ప్రయత్నాల తర్వాత అతను వ్యాపారంలో విజయం సాధించాడు. బిల్ కమ్మింగ్స్ కంపెనీ ఇప్పుడు బిలియన్ స్థాయిలో వ్యాపారం చేయడానికి కారణం తన యవ్వనంలో తనకు లభించిన అనుభవమేనని చెప్పారు. మొదట్లో  బిల్ కమ్మింగ్స్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు. తరువాత  ధనవంతుడు కావాలనే కల పుట్టింది. 

బిల్ కమ్మింగ్స్ డబ్బును వృధా చేయలేదు: 
బిల్ కమ్మింగ్స్‌కు ఇప్పుడు డబ్బుకు కొరత లేదు. అయితే, అతను  అతని భార్య విలాసవంతంగా జీవించడం లేదు. ఇద్దరూ ఇంకా ఖర్చు తగ్గించుకోవడం గురించి ఆలోచిస్తున్నారు. చిన్నతనంలో తక్కువ ఖర్చు పెట్టాలని తల్లిదండ్రులు తనకి  నేర్పించారట. ఇప్పుడు కూడా బిల్ కమ్మింగ్స్ దానిని అనుసరిస్తున్నాడు. మీరు విజయం సాధించడానికి ప్రయత్నించాలి. కష్టపడి పనిచేయడానికి వెనుకాడకూడదని 
బిల్ కమ్మింగ్స్ అంటున్నారు. బిల్ కమ్మింగ్స్ తన పుస్తకంలో హార్డ్ వర్క్, సాధించాలనే కోరిక, సంకల్పం ఇంకా అంకితభావం కంటే మరేదీ ముఖ్యమైనది కాదని పేర్కొంటూ రాసారు. 
 

మీరు ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఇవన్నీ చూపించలేమని బిల్ కమ్మింగ్స్ చెప్పారు. అతని ప్రకారం ఆఫీసులో పని చేయడం చాలా ముఖ్యం. 

వ్యాపారాన్ని లీడర్‌గా నడిపించాలంటే సమస్య పరిష్కారానికి  ఆలోచన తెలుసుకోవాలి. మీ మార్గంలో చాలా సమస్యలు ఎదురు చూస్తున్నాయని బిల్ చెప్పారు. యాక్టివ్‌గా ఉండటం కూడా చాలా ముఖ్యం అని బిల్ కమ్మింగ్స్ అన్నారు. 

మన స్వంత సమస్యలను ఇంకా  మన సహోద్యోగుల సమస్యలను గుర్తించడానికి  ఆలోచనతో  ట్రైన్  ఐ  ఉండాలి, అప్పుడు మనకు అదృష్టం కలిసి వస్తుందని బిల్ చెప్పారు. కంపెనీకి ఉద్యోగులను సెలెక్ట్  చేస్తున్నప్పుడు, బిల్ టీమ్ ప్లేయర్ పర్సనాలిటీ ఉన్న ఉద్యోగులను నియమిస్తాడు. కంపెనీలోని మిగిలిన ఉద్యోగులతో సఖ్యతగా పనిచేయడం ముఖ్యమని బిల్ చెప్పారు.  

Latest Videos

vuukle one pixel image
click me!