వచ్చే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఈ డేట్స్ గుర్తుంచుకోండి లేదంటే..?

First Published | Sep 26, 2023, 6:09 PM IST

న్యూఢిల్లీ (ఆగస్టు 26): ప్రతి కొత్త నెల ప్రారంభానికి ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)  హాలిడేస్  లిస్ట్ విడుదల చేస్తుంది. దీని ప్రకారం అక్టోబర్ నెల బ్యాంకుల  హాలిడేస్ కూడా  కూడా విడుదలయ్యాయి. చెప్పాలంటే అక్టోబర్ పండుగల నెల. ఈ నెలలో దసరా పండుగ రావడంతో  దేశవ్యాప్తంగా బ్యాంకులకు చాల సెలవులు రానున్నాయి. 

వీకెండ్ సెలవులతో సహా అక్టోబర్ నెలలో మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి.  ఈ సెలవులు  స్థానిక వేడుకలు ఇంకా పండుగల ప్రకారం  ఉంటాయి. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ అండ్ గెజిటెడ్ సెలవులు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు అన్ని ఆదివారాలు, రెండవ ఇంకా  నాల్గవ శనివారాలు సెలవులు ఉంటాయి. సెలవు రోజుల్లో కూడా ఆన్‌లైన్ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే, బ్యాంకుకు వెళ్లేముందు హాలిడేస్  లిస్ట్ చెక్ చేయడం మంచిది.

బ్యాంక్ సెలవులను RBI మూడు వర్గాలుగా విభజించింది. RBI హాలిడే  లిస్ట్ లో సెలవులు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ, విదేశీ బ్యాంకులు, సహకార బ్యాంకులు అండ్  ప్రాంతీయ బ్యాంకులకు వర్తిస్తాయి.
 

Latest Videos


మీరు అక్టోబర్ నెలలో బ్యాంకును వెళ్ళవలసి వస్తే, హాలిడేస్  లిస్ట్ చెక్  చేయడం మంచిది. హోమ్  లోన్ కి సంబంధించిన పని ఉన్నట్లయితే లేదా కార్/ బైక్/ వెహికిల్ లోన్ లేదా మరేదైనా ఇతర లోన్ పని కోసం మీరు బ్యాంకును వెళ్ళవలసి వస్తే, సెలవు రోజుల్లో  జాగ్రత్త వహించండి లేదంటే బ్యాంకుకు వెళ్లి తిరిగి రావాల్సి వస్తుంది. మీ సమయం ఇంకా శ్రమ రెండూ వృధా అవుతాయి. సెలవు రోజున ఏటీఎం సేవలకు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు ఎలాంటి అంతరాయం ఉండదు. 
 

అక్టోబర్ నెల హాలిడేస్ లిస్ట్ 
అక్టోబర్ 1: ఆదివారం
అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి 
అక్టోబర్ 8: ఆదివారం
అక్టోబర్ 14: రెండవ శనివారం, మహాలయ అమావాస్య (కర్ణాటక, ఒడిశా, త్రిపుర అండ్  పశ్చిమ బెంగాల్)
అక్టోబర్ 15: ఆదివారం
అక్టోబర్ 18: కటి బిహు (అస్సాం)
అక్టోబర్ 19: సంవత్సరాది పండుగ ( గుజరాత్)
అక్టోబర్ 21: దుర్గాపూజ (మహా సప్తమి)
అక్టోబర్ 22: మహా అష్టమి 

అక్టోబర్ 23: మహానవమి / ఆయుధ పూజ
అక్టోబర్ 24: దసరా / విజయదశమి/ దుర్గాపూజ
అక్టోబర్ 25: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్‌లో బ్యాంక్ సెలవు)
అక్టోబర్ 26: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకు సెలవు)
అక్టోబర్ 27: దుర్గాపూజ  నాల్గవ శనివారం , లక్ష్మీ పూజ (కోల్‌కతాలో బ్యాంక్ సెలవు)
అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు (అహ్మదాబాద్‌లో బ్యాంక్ సెలవు)

click me!