ఆపిల్ సి‌ఈ‌ఓ టిమ్ కుక్ 2021లో ఎంత సంపాదించారో తెలుసా.. వివరాలు చూస్తే షాకవుతారు..

First Published Jan 7, 2022, 2:03 PM IST

  ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ అండ్ అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ ఆపిల్ సీఈఓగా టిమ్ కుక్(tim cook) కి నాయకత్వం వహిస్తున్నారు. సహజంగానే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి టిమ్ కుక్ ఎంత డబ్బు సంపాదిస్తాడు అనే ఆసక్తి ఉంటుంది.  

2021లో బేసిక్ పే, స్టాక్ ఇతర కంపెన్సేషన్‌లతో టిమ్ కుక్ మొత్తం 98.7 మిలియన్ల డాలర్లు ఆర్జించారు. అంటే భారతీయ రూపాయలలోకి  దాదాపు రూ. 733 కోట్లకు సమానం. ఆపిల్ సీఈఓగా టిమ్ కుక్  ప్రోత్సాహకాలలో సెక్యూరిటి అండ్ ప్రైవేట్ విమానాలు ఉన్నాయి.  ఇటీవల ఎస్‌ఈ‌సి(SEC) ఫైలింగ్‌లో ఆపిల్ సీఈఓ మొత్తం రెమ్యునరేషన్ ప్యాకేజీని వెల్లడించింది. అయితే 2011లో  టిమ్ కుక్ ఆపిల్ సి‌ఈ‌ఓ బాద్యతలు చేపట్టారు.

2020లో టిమ్ కుక్ 14 మిలియన్ల డాలర్ల (సుమారు రూ. 104 కోట్లు) జీతం కంటే 98.7 మిలియన్లు ఎక్కువ. ఎస్‌ఈ‌సి ఫైలింగ్ ప్రకారం టిమ్ కుక్ ప్రాథమిక వేతనం 3 మిలియన్ల డాలర్లు (సుమారు రూ. 22.30 కోట్లు), సంస్థ  ఆర్థిక అండ్ పర్యావరణ స్థిరత్వ లక్ష్యాలను పూర్తి చేసినందుకు  12 మిలియన్ల డాలర్లు (సుమారు రూ. 89.20 కోట్లు) పొందారు. 

సెలవుల కోసం 23,077డాలర్లు, అతని 401(k) ప్లాన్‌కు 17,400 డాలర్ల సహకారంతో పాటు కంపెన్సేషన్ గా 1.39 మిలియన్ల డాలర్లు  ఇందులో ప్రైవేట్ జెట్ విమానాలకు  712,488డాలర్లు, భద్రత కోసం 630,630డాలర్లు పొందారు. టిమ్ కుక్ దాదాపు 82.5 మిలియన్  డాలర్ల(సుమారు రూ. 613 కోట్లు) స్టాక్ అవార్డులను కూడా అందుకున్నాడు. భద్రతా కారణాల దృష్ట్యా కమర్షియల్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించడానికి సి‌ఈ‌ఓలను అనుమతించడం లేదని ఆపిల్ పేర్కొంది.

ఫైలింగ్ ప్రకారం ఆపిల్ లాభాలు 2021లో గణనీయంగా  పెరిగాయని, లాక్ డౌన్, కోవిడ్ భయాందోళనలు కంపెనీ ప్రపంచ విక్రయాలపై ప్రభావం చూపలేదని తెలిపాయి.

ఆపిల్ ఆదాయంలో 33 శాతం పెరుగుదల, అమ్మకాలలో 365 బిలియన్ డాలర్లు పెరిగాయని పేర్కొంది. యాపిల్ చరిత్రలో 3 ట్రిలియన్ల డాలర్ల  విలువ కలిగిన మొట్టమొదటి సంస్థగా అవతరించింది, తద్వారా సంస్థ చాలా దేశాల మొత్తం జి‌డి‌పి కంటే పెద్దదిగా చేసింది. 

ఆపిల్ షేర్లు 2022 ట్రేడింగ్‌లో మొదటి రోజున 182.88 ఇంట్రా-డే రికార్డు గరిష్ట స్థాయిని సాధించాయి, ఆపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. 

click me!