గురువారం నష్టాలకు బ్రేక్.. నేడు లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్‌..పెట్టుబడిదారులకు బిగ్ రెలిఫ్..

First Published Jan 7, 2022, 10:21 AM IST

ఈ వారం చివరి ట్రేడింగ్ రోజున శుక్రవారం స్టాక్ మార్కెట్ (stockmarket)లాభాలతో  ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్(sensex) 329 పాయింట్లు పెరిగి 59,931 వద్ద దీనితో పాటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ (nifty)కూడా బలమైన ప్రారంభంతో 97 పాయింట్లు జంప్ చేసి 17,842 వద్ద ప్రారంభమైంది. 
 

వరుసగా మూడు రోజుల పాటు లాభాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్ వారంలో నాలుగో రోజైన గురువారం బ్రేక్ పడటం గమనార్హం. ట్రేడింగ్ ముగిసే సమయానికి, బి‌ఎస్‌ఈ 30-షేర్ల సెన్సెక్స్ 621 పాయింట్లు పడిపోయింది దీంతో మళ్లీ 60 వేల దిగువకు వచ్చి 59,601 స్థాయి వద్ద ముగిసింది. కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయి 17,746 వద్ద ముగిసింది. బుధవారం సెన్సెక్స్ భారీ జంప్ చేయడం ద్వారా 60 వేల స్థాయిని అధిగమించింది. 

ఐసిఐసిఐ బ్యాంక్ , పవర్ గ్రిడ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో పాటు దాదాపు 3% వృద్ధితో టైటాన్ టాప్ ఇండెక్స్ గెయినర్లు గా ఉన్నాయి. మరోవైపు, హెచ్‌డిఎఫ్‌సి   వరస్ట్ పర్ఫర్మర్  స్టాక్‌గా ఉండగా డా. రెడ్డీస్, బజాజ్ ఆటో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
 

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్  నిధులను సేకరిస్తు అలాగే కొంత పెట్టుబడి  కూడా పెడుతోంది. హైపర్‌లోకల్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ డన్జోలో 25.8% వాటా కోసం 200 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు గురువారం ఆర్‌ఐ‌ఎల్ ప్రకటించింది. అలాగే  ఓవర్సీస్ ఆర్‌ఐ‌ఎల్ భారతదేశ  అతిపెద్ద విదేశీ కరెన్సీ బాండ్ జారీలో 4 బిలియన్ల డాలర్లను సేకరించింది. అధిక వ్యయంతో కూడిన రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు బాండ్లను జారీ చేసినట్లు ఆర్‌ఐఎల్ తెలిపింది. ఈ‌ మూడు విడతల బాండ్‌లు 10 ఏళ్లు, 30 ఏళ్లు ఇంకా 40 ఏళ్ల మెచ్యూరిటీని కలిగి ఉంటాయి. మరోవైపు, డన్జోలో ఆర్‌ఐఎల్ పెట్టుబడి చాలా పెద్దది.  

ఉదయం 9:10 గంటల సమయానికి 174 పాయింట్లు లాభపడి 59,776ల పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 17,797 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నవంబరు చివరి వారం నుంచి మార్కెట్‌లో బుల్‌, బేర్‌లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతుండటంతో ఇన్వెస్టర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

click me!