Self made billionaire: చెన్నైకి చెందిన 31 ఏళ్ల ఏ యువకుడు మనదేశంలోనే అతి పిన్న బిలియనీర్, సొంతంగా ఎదిగిన వ్యక్తి

Published : Oct 02, 2025, 07:07 PM IST

భారతదేశంలో అతి పిన్న వయసులోనే బిలియనీర్‌గా (Self made billionaire) చెన్నైకి చెందిన యువకుడు నిలిచాడు. అతను ఏఐ కంపెనీ పెర్పెప్లెక్సిటి సహావ్యవస్థపకుడు సీఈఓ అయినా అరవింద్ శ్రీనివాస్. ఆయన వారసత్వంగా కాదు సొంతంగా ఎదిగి బిలియనీర్ గా ఎదిగాడు. 

PREV
15
మనదేశంలో బిలియనీర్లు

మన దేశంలో అత్యంత ధనవంతుల జాబితా 2025 విడుదలయ్యింది. హురున్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం మనదేశంలో బిలియనీర్ల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఆ సంఖ్య 350కి చేరినట్టు తెలుస్తోంది. వీరందరి ఆస్తి కలిపితే 167 లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్టు సమాచారం. అంటే మన దేశం జీడీపీలో దాదాపు సగం వీరి దగ్గరే ఉంది. దీన్నిబట్టి బిలినియర్లు మన దేశంలో ఎంతగా పెరుగుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

25
మహిళా బిలియనీర్లు

ఇక బిలీయనీర్లు అధికంగా ఉన్న నగరంగా ముంబై మొదటి స్థానంలో నిలిచింది. ముంబైలో 451 మంది బిలియనీర్లు ఉన్నట్టు అంచనా. ఆ తర్వాతి స్థానంలో న్యూఢిల్లీ బెంగళూరు నిలిచాయి. మనదేశంలోని అత్యంత ధనవంతులు నివసించే నగరాలు ఈ మూడే. ఇక ఈ జాబితాలో నూట ఒక్క మంది మహిళలు కూడా బిలియనీర్లుగా ఉన్నారు.గత ఏడాదితో పోలిస్తే మహిళల ఆర్థిక స్థితి కూడా బలపడుతున్నట్టు తెలుస్తోంది. 

35
సెల్ఫ్ మేడ్ బిలియనీర్

ఇక మన దేశ బిలియనీర్లలో అతి తక్కువ వయసుగల వ్యక్తి అరవింద శ్రీనివాస్. ఇతడు పెర్ప్లెక్సిటీ ఏఐ కంపెనీ సహ వ్యవస్థాపకుడు,సీఈవో. 31 ఏళ్ల ఈ చెన్నై యువకుడి ఆస్తులు 21,190 కోట్ల రూపాయలుగా అంచనా. అరవింద్ 1994 జూన్ 7న చెన్నైలో జన్మించారు. చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే ఇష్టంగా ఉండేవాడు. ఐఐటి మద్రాస్ లో చదువును పూర్తి చేశారు. తర్వాత కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్డీ కూడా పూర్తి చేశారు.

45
2022లో సొంత సంస్థ

చదువు పూర్తయిన తర్వాత ఓపెన్ ఏఐ, డీప్ మైండ్, గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో పని చేశారు. ఇక సొంత కంపెనీని ప్రారంభించేందుకు సిద్ధమై.. 2022 ఆగస్టులో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పెర్ప్లెక్సిటీ ఏఐని స్థాపించారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే సెర్చ్ ఇంజన్. సూటిగా ఖచ్చితమైన సమాధానాలను ప్రతి ప్రశ్నకు అందిస్తుంది. అందుకే ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రచాదరణను పొందింది. అదే అతడిని బిలియనీర్ గా మార్చింది.

55
అంబానీదే మొదటి స్థానం

హరూన్ రిచ్ లిస్ట్ ప్రకారం ముఖేష్ అంబానీ 9.55 లక్షల కోట్ల రూపాయలు నికర విలువలతో మళ్లీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక మహిళల్లో రోష్ని నాడార్ మల్హోత్రా 2.84 లక్షల కోట్ల నికర విలువతో మొదటి మహిళగా నిలిచారు.

Read more Photos on
click me!

Recommended Stories