గూగుల్ సి‌ఈ‌ఓకి పద్మభూషణ్: ప్రైవేట్ ఉద్యోగి నుండి ఆల్ఫాబెట్ సి‌ఈ‌ఓ వరకు సక్సెస్ స్టోరీ..

First Published Jan 27, 2022, 3:59 AM IST

కృషి చేస్తే దాని ఫలితం కూడా మధురంగా ​​ఉంటుందని, అలాగే మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేరుకోకుండా ఎవరూ ఆపలేరు అని చెబుతుంటారు. ఇందుకు ఆల్ఫాబెట్ (google) సీఈఓ సుందర్ పిచాయ్ ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవడం నిదర్శనం. సుందర్ పిచాయ్ గూగుల్ లో సి‌ఈ‌ఓగా పని చేస్తు  గూగుల్ ని మెరుగుపరచడానికి తన బృందంతో పగలు, రాత్రి ఎంతో కష్టపడ్డాడు. 

తన శ్రమ, కృషి తెలియని వారెవరు..? తన జీవితంలో ఇప్పటివరకు ఎన్నో పెద్ద పెద్ద మైలురాళ్లను సాధించి నిరంతరం విజయాల మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. సుందర్ పిచాయ్ కి మరో దేశపు ఉత్తమ అవార్డు కూడా వచ్చి చేరింది.  అదేంటంటే భారత ప్రభుత్వం అతనిని వాణిజ్య-పరిశ్రమ విభాగంలో పద్మభూషణ్‌తో సత్కరించింది. 
 

17 మంది వ్యక్తులు 
ఈ ఉత్తమ అవార్డును అందుకున్న 17 మంది వ్యక్తులలో సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. 2015లో ప్రపంచంలోనే ప్రముఖ ఐటీ కంపెనీ గూగుల్‌ సీఈవోగా సుందర్ పిచాయ్ బాధ్యతలు చేపట్టారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, గూగుల్‌లో ఈ పెద్ద బాధ్యతను పొందిన భారతీయ సంతతికి చెందిన పౌరుడు.

తమిళనాడులో జన్మించి 
సుందర్ పిచాయ్ అసలు పేరు సుందరరాజన్, అతను భారత సంతతికి  చెందినవాడు. అతని పుట్టుక గురించి మాట్లాడితే అతను 1972 సంవత్సరంలో మధురై (తమిళనాడు)లో జన్మించాడు. అలాగే అక్కడ ఉన్న చెన్నైలో పెరిగాడు. 1993లో పిచాయ్ ఐ‌ఐ‌టి ఖరగ్‌పూర్ నుండి బిటెక్ పూర్తి చేసాడు, అదే సంవత్సరంలో అతను స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి స్కాలర్‌షిప్ పొందాడు. ఇక్కడ నుండి అతను ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని, వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి ఎం‌బి‌ఏ పట్టా  పొందాడు.
 

మొదటి పని
సుందర్ పిచాయ్ 1995లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సుందర్ పిచాయ్ ప్రతి పాత వస్తువును ఉపయోగించి డబ్బు ఆదా చేసేవాడు. అదే సమయంలో అతను ఉద్యోగం చేయవలసి వచ్చింది. అతని మొదటి ఉద్యోగం ఒక కంపెనీలో ప్రాడక్ట్ మేనేజర్. సుందర్ పిచాయ్ గూగుల్‌లో చేరడానికి ముందు సాఫ్ట్‌వేర్ కంపెనీ అప్లైడ్ మెటీరియల్స్ అండ్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేశారు.

ఈ విధంగా గూగుల్ లో 
సుందర్ పిచాయ్ ఏప్రిల్ 2004లో గూగుల్‌లో చేరారు. అతను తన మొదటి ప్రాజెక్ట్‌ను ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ బ్రాంచ్‌లో అందించాడు. గూగుల్ సెర్చ్ టూల్‌ను మెరుగుపరచడం అలాగే ఇతర బ్రౌజర్‌ల వినియోగదారులను గూగుల్‌లోకి తీసుకురావడం వంటి బాధ్యతలను అతనికి  అందించారు.  

ఇలా గూగుల్ సి‌ఈ‌ఓగా
సుందర్‌ పిచాయ్‌ కష్టాన్ని, పని తీరును చూసి 2015లో గూగుల్‌ సీఈవోగా నియమితులయ్యారు. సుందర్‌ పిచాయ్ అంతటితో ఆగలేదు, అతను ఎదుగుదల కొనసాగించాడు మరోవైపు జూలై 2017లో ఆల్ఫాబెట్ డైరెక్టర్ల బోర్డులో చేరాడు. అతను గత 15 సంవత్సరాలలో గూగుల్ లో పని చేయడం ద్వారా ఎన్నో గొప్ప ఉత్పత్తులను అభివృద్ధి చేసాడు.

click me!