budget 2022:ఈసారి కూడా కరోనా భయల మధ్య దేశ ఆర్ధిక బడ్జెట్.. మరోసారి 'హల్వా వేడుక' వాయిదా..

First Published Jan 26, 2022, 11:18 PM IST

భరతదేశ  ఆర్ధిక బడ్జెట్‌ ప్రకటనకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎప్పటిలాగే ఈసారి కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నాల్గవ బడ్జెట్‌ను 1 ఫిబ్రవరి 2022న ప్రవేశపెట్టనున్నారు. ఒక నివేదిక ప్రకారం ఈ సంవత్సరం కూడా వార్షిక బడ్జెట్ ఏకొ ఫ్రెండ్లీగా  ఉంటుంది. 

బడ్జెట్ డాక్యుమెంట్స్ ఎక్కువగా డిజిటల్ రూపంలోనే అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. భౌతికంగా కొన్ని కాపీలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. 

బడ్జెట్ కాపీల ప్రింటింగ్ 
కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆసియా  మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ  పన్ను ప్రతిపాదనలు ఇంకా ఆర్థిక నివేదికలకు సంబంధించి పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్స్ ముద్రించడం కూడా ఈసారి జరగదు. సాధారణంగా బడ్జెట్ డాక్యుమెంట్స్  కొన్ని వందల కాపీలు ముద్రించబడతాయి. బి‌జే‌పి నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ కాపీల ముద్రణ తగ్గింది. మొదట్లో జర్నలిస్టులు,  విశ్లేషకులకు పంపిణీ చేసిన కాపీలు తగ్గించబడ్డాయి తరువాత కరోనా మహమ్మారి కారణంగా లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు ఇచ్చే కాపీలను తగ్గించారు. ఈ సంవత్సరం కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌కి సంబంధించి మరిన్ని పరిమితులు విధించింది.  
 

ఈసారి కూడా వాయిదా పడిన హల్వా వేడుక
కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ బడ్జెట్ డాక్యుమెంట్స్ ముద్రించే పనిని సంప్రదాయ 'హల్వా వేడుక'తో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఇంకా మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు హాజరవుతారు. కరోనా  కొత్త ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందడం వల్ల ఈసారి సాంప్రదాయ హల్వా వేడుకకు కూడా వీడ్కోలు చెప్పినట్లు నివేదిక వర్గాలు పేర్కొన్నాయి. 

ఇదంతా బడ్జెట్ కాపీల్లోనే 
బడ్జెట్ డాక్యుమెంట్స్ లో సాధారణంగా పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రసంగం, ముఖ్యాంశాలు, వార్షిక ఆర్థిక నివేదికలు, పన్ను ప్రతిపాదనలతో కూడిన ఆర్థిక బిల్లు, ఆర్థిక బిల్లులోని నిబంధనలను వివరించే మెమోరాండం ఉంటాయి. 

వీటిలో మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ ఇంకా ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్‌మెంట్, ప్లాన్‌ల ఫలితాల రూపురేఖలు, కస్టమ్స్ నోటిఫికేషన్, గత బడ్జెట్ ప్రకటనల అమలు, వ్యయ బడ్జెట్ అలాగే బడ్జెట్ అంచనాలు కూడా ఉంటాయి.

click me!