కొత్త ఏడాదిలో స్టాక్ మార్కెట్ శుభారంభం.. లాభాల్లో మొదలైన సెన్సెక్స్, నిఫ్టీ..

First Published Jan 3, 2022, 10:25 AM IST

 కొత్త సంవత్సరం 2022 స్టాక్ మార్కెట్(stockmarket)  మొదటి ట్రేడింగ్ రోజు సోమవారం లాభాలలో  ప్రారంభమైంది. బి‌ఎస్‌ఈ(bse) 30-షేర్ల సెన్సెక్స్(sensex) 310 పాయింట్ల జంప్‌తో 58,564 వద్ద ప్రారంభం కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(nifty) 96 పాయింట్ల లాభంతో 17,450 స్థాయి వద్ద ప్రారంభమైంది. విశేషమేమిటంటే, 2021 సంవత్సరం చివరి రోజున స్టాక్ మార్కెట్ శుక్రవారం గ్రీన్ మార్క్‌లో ముగిసింది.

 ఒమిక్రాన్‌ భయాలు వెంటారుడుతున్నా అంతర్జాతీయ మార్కెట్‌ సూచీలు సానుకూలంగా కదులుతున్నాయి. వాటి ప్రభావం దేశీ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. రెండు మార్కెట్లలోనూ లార్జ్‌ క్యాప్‌ షేర్లలో ర్యాలీ కనిపిస్తోంది. మిడ్‌ క్యాప్‌ షేర్లు సైతం లార్జ్‌ క్యాప్‌ బాటలోనే ఉన్నాయి. 

ఉదయం 9:45 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 345 పాయింట్లు లాభపడి 58,598 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 108 పాయిం​​​​‍ట్లు లాభపడి 17,462 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ లైఫ్‌, టెక్‌ మహీంద్రా, ఐషర్‌ ట్రాక్టర్స్‌ లాభాల్లో ఉండగా ఫ్లిప్‌సైడ్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా కన్సుమర్‌ ప్రొడక్ట్‌ షేర్లు నష్టపోయాయి. 

నిఫ్టీ 50 ఇండెక్స్ శుక్రవారం 150 పాయింట్లు పెరిగి 17,354 వద్ద ముగిసింది, అయితే బి‌ఎస్‌ఈ సెన్సెక్స్. 459 పాయింట్లు లాభపడి 58,253 స్థాయిల వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 418 పాయింట్లు పెరిగి 35,481 స్థాయి వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత చార్ట్ నమూనా సానుకూల సంకేతాన్ని సూచిస్తుంది. 


 హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి మాట్లాడుతూ, "నిఫ్టీ  స్వల్పకాలిక ట్రెండ్ సానుకూలంగా కొనసాగుతోంది అలాగే స్వల్పకాలంలో మరింత పైకి ఎగబాకుతుందని ఆశించవచ్చు అని అన్నారు.

click me!