స్టాక్ మార్కెట్‌పై కరోనా నీడ.. ఇన్వెస్టర్లకు షాక్‌ ! కుప్పకూలిన నిఫ్టీ..

Ashok Kumar   | Asianet News
Published : Jan 06, 2022, 11:42 AM ISTUpdated : Jan 06, 2022, 11:49 AM IST

 స్టాక్ మార్కెట్(stockmarket) కొత్త ఏడాదిలో వరుసగా మూడు రోజుల పాటు ఊపందుకుంది, కానీ వారంలోని నాలుగో ట్రేడింగ్ రోజు నేడు బ్రేక్ పడింది. బలహీనమైన గ్లోబల్ సూచనలు, కరోనా ఇన్‌ఫెక్షన్ (corona infections)కేసులు ఎప్పటికప్పుడు పెరుగుతున్న కారణంగా షేర్ మార్కెట్ గురువారం రెడ్ మార్క్‌లో ప్రారంభమైంది.

PREV
13
స్టాక్ మార్కెట్‌పై కరోనా నీడ.. ఇన్వెస్టర్లకు షాక్‌ ! కుప్పకూలిన నిఫ్టీ..

. స్టాక్  మార్కెట్ ప్రారంభంలో బి‌ఎస్‌ఈ 30-షేర్ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పడిపోయింది దీంతో మళ్లీ 60 వేల దిగువకు చేరింది. ప్రారంభంలో సెన్సెక్స్ 585 పాయింట్లు పడిపోయి 59,638 స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం అరగంట ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 820 పాయింట్లు లేదా 1.36 శాతం నష్టపోయి 59,402 వద్ద ట్రేడవుతోంది. 
 

23

సెన్సెక్స్ లాగానే  నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా భారీగా క్షీణించి 171 పాయింట్ల పతనంతో 17,800 దిగువకు పడిపోయింది. నేడు అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా పడిపోయాయి. మరోవైపు హిండాల్కో షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. విశేషమేమిటంటే, బుధవారం స్టాక్ మార్కెట్ వరుసగా మూడవ ట్రేడింగ్ రోజు లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 367 పాయింట్లు లేదా 0.61 శాతం పెరిగి 60,233 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 120 పాయింట్లు లేదా 0.67 శాతం పెరిగి 17,925 వద్ద ముగిసింది.

33

యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఊహించినదాని కంటే ముందుగానే వడ్డీ రేట్లు పెంచాలని నిర్ణయించుకుందనే వార్తలు వ్యాపించడంతో విదేశీ ఇన్వెస్టర్లు అయోమయంలో  పడ్డారు. దీంతో క్రిస్మస్‌ సీజన్‌ ముగిసిన తర్వాత న్యూ ఇయర్‌లో దేశీ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్న విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుందని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. 

ఉదయం షేర్ మార్కెట్‌ మొదలైన పదిహేను నిమిషాల్లోనే 546 పాయింట్లు నష్టపోయింది. దీంతో మరోసారి 60 వేల పాయింట్ల దిగువకు వచ్చింది. మరోవైపు నిఫ్టీ 156 పాయింట్లు నష్టపోయి 17,768 దగ్గర ట్రేడవుతోంది. సాయంత్రం వరకు ఇదే ట్రెండ్‌ కొనసాగితే మరోసారి ఇన్వెస్టర్లు భారీ నష్టం తప్పదు. 

click me!

Recommended Stories