లాభాల్లో స్టాక్ మార్కెట్: 455 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్, అదేబాటలో నిఫ్టీ..

Ashok Kumar   | Asianet News
Published : Dec 16, 2021, 03:43 PM IST

నేడు ఈ వారంలోని నాలుగో ట్రేడింగ్ రోజున గురువారం స్టాక్ మార్కెట్ (stock market)బిగ్ బూమ్ తో ప్రారంభమైంది. బి‌ఎస్‌ఈ (bse)30-షేర్ సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభం కాగా, ఎన్‌ఎస్‌ఈ  నిఫ్టీ (nifty)కూడా లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. సెన్సెక్స్ 455.40 పాయింట్ల (0.79 శాతం) లాభంతో 58,243.43 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ ఇండెక్స్ 151.60 పాయింట్లు (0.88 శాతం) లాభంతో 17,373 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

PREV
14
లాభాల్లో స్టాక్ మార్కెట్:  455 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్,  అదేబాటలో నిఫ్టీ..

ఈ స్టాక్‌లలో లాభాలు
30 సెన్సెక్స్ స్టాక్‌లలో ఐదు పడిపోతుండగా, 25 స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ లాభపడిన వాటిలో ప్రముఖంగా ఉన్నాయి. మరోవైపు, సెన్సెక్స్ క్షీణిస్తున్న షేర్ల గురించి మాట్లాడినట్లయితే వీటిలో బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, మారుతీ, సన్ ఫార్మా ఉన్నాయి. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని 50 స్టాక్స్‌లో 37 స్టాక్‌లు లాభాల్లో ట్రేడవుతుండగా, 11 క్షీణతలో ఉన్నాయి. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. మరోవైపు, పడిపోయిన స్టాక్‌లలో సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్, హిందుస్థాన్ యూనిలీవర్ ఉన్నాయి.

24

మూడు రోజుల నష్టాలకు బ్రేక్
బుధవారం స్టాక్ మార్కెట్ క్షీణత కారణంగా వరుసగా మూడవ రోజు నష్టాల్లో ముగిసింది. ఉదయం స్టాక్ మార్కెట్ మందగమనంతో ప్రారంభమై రోజంతా అస్థిరత తర్వాత చివరకు రెడ్ మార్క్‌లో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 58 వేల స్థాయి దిగువకు పడిపోయి 329 పాయింట్ల నష్టంతో 57,788 వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 103 పాయింట్లు దిగజారి 17,221 వద్ద ముగిసింది. 

34

డిసెంబర్ 16 మధ్యాహ్నం 3 గంటలకు 

నేడు ఒడిదుడుకుల మధ్య ట్రేడింగ్ చివరి గంటలో బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 56.40 పాయింట్లు (0.10%) పెరిగి 57844.43 వద్ద, నిఫ్టీ 14.50 పాయింట్లు (0.08%) పెరిగి 17235.90 వద్ద ఉన్నాయి. దాదాపు 1264 షేర్లు పురోగమించగా, 1847 షేర్లు క్షీణించాయి అలాగే 71 షేర్లు మారలేదు.

 క్యాపిటల్వియా గ్లోబల్ రీసెర్చ్  సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ లిఖితా చెపా మాట్లాడుతూ ఇతర ఆసియా స్టాక్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు అమ్మకాల ఒత్తిడిని కొనసాగించాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి గత సంవత్సరం గ్లోబల్ డెబ్ట్ USD 226 ట్రిలియన్లకు పెరిగిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి చెప్పడంతో మార్కెట్ పెట్టుబడిదారులు జాగ్రత్త వహించారు. 

44

డిసెంబర్ 16 మధ్యాహ్నం 2 గంటలకు 
సెన్సెక్స్ 167.84 పాయింట్లు (0.29%) పెరిగి 57955.87 వద్ద, నిఫ్టీ 43.40 పాయింట్లు (0.25% )పెరిగి 17264.80 వద్ద ఉన్నాయి. దాదాపు 1338 షేర్లు పురోగమించాయి, 1747 షేర్లు క్షీణించాయి, 77 షేర్లు మారలేదు.
 

click me!

Recommended Stories