Fixed Depositను తలదన్నే స్కీమ్ SBI MODS: మీరు ఊహించని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి

First Published | Jan 12, 2025, 7:20 PM IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం అద్భుతమైన స్కీమ్ ని తీసుకొచ్చింది. దీని పేరు మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ (MODS). ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే మంచి పెట్టుబడి ఆప్షన్. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 

వడ్డీల ద్వారా స్థిరమైన ఆదాయం పొందేందుకు అందరూ ఫిక్స్‌డ్ డిపాజిట్లు(Fixed deposit) చేస్తుంటారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అనేక బ్యాంకులు ఎఫ్‌డీలపై అధిక వడ్డీరేట్లను ఇస్తున్నాయి. కాని ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభదాయకమైన ఫిక్స్ డ్ డిపాజిట్లతో పాటు ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ అందిస్తోంది. 

ఇప్పటి వరకు తన కస్టమర్లకు అద్భుతమైన ఎఫ్‌డీ స్కీమ్స్ అందించిన ఎస్బీఐ మరో సూపర్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ పేరు మల్టీఆప్షన్ డిపాజిట్ (MOD) స్కీమ్‌. ఇందులో ఖాతాదారులు తమ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్లకు అనుబంధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏర్పాటు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఈ డిపాజిట్ల నుండి అవసరమైన మొత్తాన్ని విత్‌డ్రా కూడా చేయవచ్చు. అప్పుడు మిగిలిన డిపాజిట్‌పై వడ్డీ కూడా మీరు పొందవచ్చు.


ఎస్‌బిఐ మోడ్స్‌లో ఉన్న మంచి సదుపాయం ఏంటంటే.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ ఇందులో లభిస్తుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే.. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారు ముందే డబ్బులు తీసుకోవచ్చు. అలా తీసుకున్నందుకు ఎలాంటి జరిమానా కట్టాల్సిన అవసరం ఉండదు.

సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బులు తీసినట్టే ఏటీఎం లేదా చెక్కు ద్వారా ఈ స్కీమ్ లోని డబ్బులు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ పథకం మీ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ తో అనుసంధానమై ఉంటుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ కి మోడ్స్ స్కీమ్ కి ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే.. ఎఫ్‌డిని టెన్యూర్ అవకుండా ఆపేస్తే మొత్తం డబ్బులు వస్తాయి. కానీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మోడ్స్‌లో అలా కాదు. అవసరాన్ని బట్టి డబ్బులు తీసుకోవచ్చు. అందులో మిగిలిన డబ్బులకి బ్యాంకు వడ్డీ ఇస్తుంది.

ఎస్‌బిఐ మోడ్స్‌లో 1000 రూపాయల మల్టిపుల్స్‌లో డబ్బులు పెట్టాలి. అదే విధంగా తీసుకోవాలి. ఎన్నిసార్లైనా డబ్బులు తీసుకోవచ్చు.

ఎస్‌బిఐ మోడ్స్‌ స్కీమ్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఇందులో 1 నుంచి 5 ఏళ్ల వరకు డబ్బులు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ రేట్లు కాలాన్ని బట్టి మారుతాయి. సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ ఉంటుంది. నామినీ సౌకర్యం కూడా ఉంది.

మోడ్స్ ఖాతాను వేరే బ్రాంచ్‌కి మార్చవచ్చు. అయితే మోడ్స్ స్కీమ్ కి  అటాచ్ చేసిన సేవింగ్స్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాలి.

Latest Videos

click me!