ఐఐటి నుండి ఆర్బిఐ గవర్నర్ వరకు సంజయ్ మల్హోత్రా ప్రయాణం :
సంజయ్ మల్హోత్రా ఐఐటి కాన్పూర్ లో కంప్యూటర్ సైన్స్ చదివారు. గ్రాడ్యూయేషన్ పూర్తయ్యాక ఉన్నతచదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేసారు. ఇలా దేశ విదేశాల్లో ఉన్నత విద్యాబ్యాసం చేసిన ఆయనకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. వాటన్నింటికి కాదని ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్ వైపు వచ్చారు.
అమెరికానుండి స్వదేశానికి వచ్చిన సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యాడు. ఇలా 1990 లో సివిల్స్ క్లియర్ చేసి రాజస్థాన్ లో ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి ఆయన వెనుదిరిగి చూడలేదు... అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకుంటూ ప్రస్తుతం దేశంలోనే అత్యున్నత ఆర్థిక సంస్థ రిజర్వ్ బ్యాంక్ కు చీఫ్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
ఆర్‌బిఐ గవర్నర్‌గా ప్రకటన రాకముందు సంజయ్ మల్హోత్రా రెవెన్యూ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన ఆర్‌ఈసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఇటీవల ఆయన అధిక పన్ను వసూళ్లలో కీలక పాత్ర పోషించారు.