Russia Ukraine War:ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న రష్యా ఆయుధాలు.. ఈ 5 ప్రమాదకరమైన వాటి గురించి..

Ashok Kumar   | Asianet News
Published : Mar 05, 2022, 12:18 PM IST

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రమాదకర మలుపు తిరిగింది. రష్యా దాడితో ఉక్రెయిన్‌ తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. ఉక్రెయిన్‌కు సహాయం చేస్తున్న దేశాలు రష్యాపై సైన్యాన్ని ప్రయోగించడానికి ఇష్టపడట్లేదు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రష్యాపై ఎన్నో ఆంక్షలు ప్రకటించారు, అయితే ఉక్రెయిన్‌లోకి అమెరికా తన సైన్యాన్ని పంపించదు అని చెప్పారు. 30 దేశాల సమూహం అయిన నాటో(nato) కూడా రష్యాను దాడులతో నేరుగా బెదిరించడం లేదు.   

PREV
16
Russia Ukraine War:ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న రష్యా  ఆయుధాలు..  ఈ 5 ప్రమాదకరమైన వాటి గురించి..

ఏ దేశమైనా జోక్యం చేసుకుని మా దేశానికి ముప్పు తెచ్చే ప్రయత్నం చేస్తే రష్యా తక్షణమే చర్యలు తీసుకుంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ఇలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. నాటో, అమెరికా కూడా భయపడే విధ్వంసక ఆయుధాలు రష్యా వద్ద ఉన్నాయి. కాబట్టి రష్యా వద్ద ఉన్న ఈ ఐదు ప్రమాదకరమైన ఆయుధాల గురించి తెలుసుకుందాం ...
 

26

ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టిస్తున్న రష్యాపై ఢీకొనేందుకు వెనుకంజ వేస్తున్న నాటో, అమెరికా ఎందుకు ధైర్యం చేయలేక పోతున్నాయోతెలుసా. దీనికి అతిపెద్ద కారణం రష్యా ప్రమాదకర ఆయుధాలు. ఈ ఆయుధాలతో రష్యా శత్రువులనైనా నాశనం చేయగలదు. ఈ ఆయుధాలను మోహరించడం ద్వారా ఎలాంటి శత్రువయిన భయభ్రాంతులవుతారు. రష్యా వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద అణు బాంబు ఉంది. 1961లో సోవియట్ యూనియన్ (నేటి రష్యా) సూపర్ డిస్ట్రక్టివ్ హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. ఈ హైడ్రోజన్ బాంబు జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా వేసిన అణు బాంబు కంటే 3333 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. 
 

36

రష్యాలోని  ప్రమాదకరమైన ఆయుధాలు 
1 - జార్ బాంబు ప్రపంచంలోనే అతిపెద్ద అణు బాంబు. అది పేలిన వెంటనే లక్షలాది మంది చనిపోవచ్చు. అంతే కాకుండా చర్మ, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. 

46

2- రష్యా కింజల్ హైపర్‌సోనిక్ క్షిపణులు అత్యంత ప్రమాదకరమైనవి. రష్యాకు చెందిన మిగ్ 31 యుద్ధ విమానాల్లో ఈ హైపర్‌సోనిక్ న్యూక్లియర్ క్షిపణిని అమర్చారు. 
 

56

3- రష్యా 2S7 పియోన్ ఫిరంగిని కలిగి ఉంది, ఇది స్వల్ప-శ్రేణి అణు దాడి చేయగలదు. ఈ ఫిరంగి ద్వారా 203 ఎంఎం అణుబాంబు దాడి చేయవచ్చు. 

66

4- రష్యా వద్ద బెల్గోరోడ్ న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఉంది, దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద జలాంతర్గామిగా పిలుస్తారు. పోసిడాన్ టార్పెడోలను అమర్చిన ఈ జలాంతర్గామి రేడియోధార్మిక సునామీలను సృష్టించగలదు. 

5- ఇవి కాకుండా రష్యాలో T-14 అర్మాటా ట్యాంక్ చాలా ప్రమాదకరమైనది. దీనిని రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించవచ్చు. ఈ ట్యాంక్ సిబ్బంది లేకుండానే లక్ష్యాన్ని ఖచ్చితంగా చేధించగలదు. ఇది ఒక నిమిషంలో 10 నుండి 12 రౌండ్లు కాల్చగలదు. 

click me!

Recommended Stories