అందులో వితంతు పెన్షన్ పథకం ముఖ్యమైనది. వితంతు పెన్షన్ స్కిం ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని వితంతువులకు ప్రతినెలా ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను ఆదుకోవడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం. ఈ పథకం కింద 18 నుంచి 60 ఏళ్లలోపు వితంతువులు దరఖాస్తు చేసుకోవచ్చు. వితంతువులు మరణించిన తర్వాత, వారి వారసులు లేదా ఇతర కుటుంబ సభ్యులు ఈ పథకంకి అర్హులు కారు.
ఈ పథకం కింద స్టైఫండ్ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. వార్షిక ఆదాయం రూ.2 లక్షల కంటే తక్కువ ఉన్న వితంతువులకి మాత్రమే ఈ ఆర్థిక సహాయం లభిస్తుంది.
వితంతు పెన్షన్ స్కీమ్ కింద ఇచ్చే సహాయం మొత్తం రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నెలకు కనీసం రూ.300 నుంచి గరిష్టంగా రూ.2000 వరకు అందజేస్తారు. తమిళనాడు రాష్ట్రం విషయానికి వస్తే ఈ పథకం కింద వితంతువులుకి నెలకు రూ.1000 ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.
అవసరమైన డాకుమెంట్స్ అండ్ అర్హతలు ?
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వితంతువులు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందగలరు. ఈ పథకం ప్రయోజనాలు ఏ ఇతర పెన్షన్ పథకాన్ని పొందని మహిళలకు అందించబడతాయి.
*మహిళా దరఖాస్తుదారుల వయోపరిమితి 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
*భర్త చనిపోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందలేరు.
* అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ (ఓటర్ కార్డ్/రేషన్ కార్డ్/ఆధార్ కార్డ్), వయస్సు సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్‌బుక్, భర్త మరణ ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం ఈ పథకం కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన డాకుమెంట్స్.