కేంద్ర ప్రభుత్వం ఇటీవల 25 కిలోల వరకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై (బియ్యం, పప్పులు మొదలైనవి) 5% పన్ను విధించడం ప్రారంభించింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని, కాబట్టి ఎలాంటి పన్నులు విధించవద్దని పలు వాణిజ్య, వర్తక సంఘాలు కోరాయి. అయితే ప్రభుత్వం తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో వినియోగదారులపై భారం పడకుండా తూకంలో మార్పులు చేసి ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ విక్రయించాలని రైస్ మిల్లు యజమానులు నిర్ణయించుకున్నారు