చిన్న ఫ్యామిలీస్ కి సరిపోయే కార్లకు భారతదేశంలో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. SUVలు, MPVలు వచ్చినప్పటికీ హ్యాచ్‌బ్యాక్‌లకు డిమాండ్ తగ్గలేదు. తక్కువ ధర, మంచి మైలేజ్, మంచి పెర్ఫార్మెన్స్ వంటి కారణాల వల్ల ఈ సెగ్మెంట్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.
రెనాల్ట్ క్విడ్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. చిన్న కుటుంబాలకు ఇది చాలా అనుకూలమైన మోడల్. 2024 డిసెంబర్‌లో ఈ కారు అమ్మకాలు వివరాలు ఇటీవల వెలువడ్డాయి. రెనాల్ట్ ఇచ్చిన డేటా ప్రకారం గత డిసెంబర్‌లో 628 మంది ఈ కారును కొనుగోలు చేశారు.