రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతికి యూ‌కే బ్యాటరీ టెక్నాలజీ కంపెనీ.. డీల్ విలువ ఎన్ని కొట్లంటే..

Ashok Kumar   | Asianet News
Published : Dec 31, 2021, 01:12 PM ISTUpdated : Dec 31, 2021, 01:14 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పూర్తి యాజమాన్యంలోని  రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) యూ‌కే ఆధారిత సోలార్ బ్యాటర్ కంపెనీ ఫారాడియన్ లిమిటెడ్‌ను 100 GBP మిలియన్లు అంటే 1000 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు శుక్రవారం తెలిపింది. 

PREV
15
రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతికి యూ‌కే బ్యాటరీ టెక్నాలజీ కంపెనీ.. డీల్ విలువ ఎన్ని కొట్లంటే..

ఫారాడియన్‌లో 100% వాటాను పొందేందుకు రిలయన్స్  ఒక ఒప్పందాలపై కూడా సంతకం చేసింది. అంతేకాకుండా, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్  25 GBP మిలియన్లను గ్రోత్ క్యాపిటల్‌గా పెట్టుబడి పెట్టనుందని, ఇది వాణిజ్య విస్తరణను వేగవంతం చేస్తుందని కంపెనీ శుక్రవారం విడుదల చేసింది.

25

డీల్ ఏంటంటే .. ఈ డీల్ కింద రిలయన్స్ సోలార్ ఫారాడియోన్ 88.92 శాతం ఈక్విటీ షేర్ల కోసం 83.9 మిలియన్ పౌండ్లను చెల్లించనుంది. ఈ డీల్ 2022 జనవరిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. కంపెనీలో మిగిలిన 11.08 శాతం వాటాను వచ్చే మూడేళ్లలో  10.45 GBP మిలియన్లకు కొనుగోలు చేస్తారు. ఇది కాకుండా రిలయన్స్ న్యూ ఎనర్జీ 31.5 మిలియన్ పౌండ్ల పెట్టుబడికి ఫారాడియన్  కొత్త షేర్లను కొనుగోలు చేయడానికి కూడా అంగీకరించింది. ఇందులో 25 మిలియన్ పౌండ్లను గ్రోత్ క్యాపిటల్‌కు కేటాయించగా, మిగిలిన మొత్తాన్ని రుణం ఇంకా ఇతర ఛార్జీల చెల్లింపుకు వినియోగిస్తారు. ఈ ఒప్పందం తర్వాత, రిలయన్స్  పూర్తి ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ స్టోరేజ్ గిగా ఫ్యాక్టరీలో ఫారడియోన్  అత్యాధునిక టెక్నాలజిని ఉపయోగించుకోగలుగుతుంది. సమాచారం ప్రకారం, కంపెనీ సోడియం-అయాన్ టెక్నాలజీకి సంబంధించిన చాలా అంశాలను కవర్ చేసే పోటీతత్వంతో ఉన్నతమైన, వ్యూహాత్మకమైన, విస్తృతమైన ఇంకా విస్తృతమైన ఐ‌పి పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది.

35

 ప్రపంచంలోని ప్రముఖ బ్యాటరీ టెక్నాలజీ కంపెనీలలో ఫారడియోన్ ఒకటి. ఈ కంపెనీ ఇంగ్లాండ్‌లోని షెఫీల్డ్ అండ్ ఆక్స్‌ఫర్డ్‌లో ఉంది. సోడియం-అయాన్ బ్యాటరీ టెక్నాలజీకి కంపెనీ పేటెంట్‌ను కలిగి ఉంది. నేడు ఉదయం 11.23 గంటలకు కంపెనీ షేరు 0.52 శాతం లాభంతో రూ.2368.80 వద్ద ట్రేడవుతోంది. కాగా, ఈరోజు కంపెనీ షేరు రూ.2370 వద్ద ప్రారంభమై రూ.2379.45తో రోజు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఒక రోజు ముందు ఈ షేరు రూ.2356.45తో ముగిసింది.

45

ఆర్‌ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ కొనుగోలు గురించి మాట్లాడుతూ, “ఫారాడియన్ అలాగే దాని అనుభవజ్ఞులైన బృందాన్ని రిలయన్స్ కుటుంబానికి మేము స్వాగతిస్తున్నాము. ఇది అత్యంత అధునాతనమైన, ఇంటిగ్రటెడ్ న్యూ ఎనర్జీ ఎకోసిస్టమ్‌లో ఒకదానిని సృష్టించడానికి అలాగే భారతదేశాన్ని ప్రముఖ బ్యాటరీ టెక్నాలజిలలో ముందంజలో ఉంచాలనే మా ఆశయాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఫారాడియన్ అభివృద్ధి చేసిన సోడియం-అయాన్ టెక్నాలజి ప్రపంచవ్యాప్తంగా లీడింగ్ ఎనర్జి స్టోరేజ్ అండ్ బ్యాటరీ సొల్యుషన్స్ అందిస్తుంది, ఇది సురక్షితమైనది, స్థిరమైనది, హై ఎనర్జి డెన్సిటీ అందిస్తుంది. అదనంగా మొబిలిటీ నుండి గ్రిడ్ స్కేల్ స్టోరేజ్ అండ్ బ్యాకప్ పవర్ వరకు విస్తృత వినియోగ అప్లికేషన్స్ కలిగి ఉంది అని అన్నారు.

55

ఫారాడియన్ సి‌ఈ‌ఓ జేమ్స్ క్విన్ మాట్లాడుతూ “సోడియం-అయాన్ బ్యాటరీ టెక్నాలజిని సాధించిన మొదటి వాటిలో ఫెరాడియన్ ఒకటి. వేగంగా విస్తరిస్తున్న భారతీయ మార్కెట్‌లో ఫారాడియన్ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి అలాగే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ ట్రాన్స్ఫార్మేషన్ జాయింట్ గా వేగవంతం చేయడానికి రిలయన్స్ సరైన భాగస్వామి. రిలయన్స్ గ్రూప్‌లో భాగం కావడం సోడియం-అయాన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో మా బృందం చేసిన అద్భుతమైన పనిని ధృవీకరిస్తుంది. రిలయన్స్‌తో కలిసి ఫారాడియన్ భారతదేశానికి ఇంకా ప్రపంచవ్యాప్తంగా బ్రిటీష్ ఆవిష్కరణలను తీసుకురాగలదు, ఎందుకంటే ప్రపంచం లిథియం కంటే ముందుకు కనిపిస్తుంది. భారతదేశం నెట్ జీరో మిషన్‌లో భాగం కావాలని మేము ఎదురుచూస్తున్నాము అని అన్నారు.

click me!

Recommended Stories