వినియోగదారులకు Reliance Jio సూపర్ ఆఫర్

First Published | Sep 6, 2024, 3:37 PM IST

Reliance Jio బంపర్‌ ఆఫర్ తీసుకొచ్చింది. రిలయన్స్‌ జియో 8వ వార్షికోత్సవ వేళ వినియోగదారులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Reliance Jio సంస్థ 8వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కొన్ని ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్‌లను విడుదల చేసింది. టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్ OTT ప్లాట్‌ఫారమ్‌లకు బండిల్ సబ్‌స్క్రిప్షన్‌లు, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల పరిమిత సభ్యత్వం ఇస్తోంది. అర్హత ఉన్న ప్యాక్‌లతో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు ఇ-కామర్స్ వోచర్‌లతో సహా ప్రయోజనాలను అందిస్తోంది. 

Reliance ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇటీవలే 47వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేసింది. ఇప్పుడు మళ్లీ జియో వార్షికోత్సవం రావడంతో వినియోగదారులకు అనేక ఆఫర్లు ప్రకటించారు. 
 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తన కుమారుడు అనంత్‌ అంబానీ ఎంగేజ్‌మెంట్‌, వివాహాన్ని అత్యంత ఘనంగా చేసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా చేశారు. అయితే అది జరిగిన వెంటనే టారిఫ్‌ ధరలను పెంచి విమర్శల పాలయ్యారు. కుమారుడి పెళ్లి ఖర్చులన్నీ జనాలపై రుద్దుతున్నారని నెట్టింట ప్రజలు విమర్శలు గుప్పించారు. దీనికి తోడు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒక్కటే టారిఫ్‌లు పెంచకుండా వినియోగదారులకు ఆకర్షిస్తోంది. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా కూడా వాటి టారిఫ్‌ ధరలను పెంచేశాయి. దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ గట్టి పోటీ ఇస్తున్న ఈ సమయంలో రిలయన్స్‌ జియో ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 
 


రిలయన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు ఇవే..
సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 8 మధ్య ప్రత్యేక ప్యాక్‌లతో రీఛార్జ్ చేసుకునే సబ్‌స్క్రైబర్‌లకు రూ. 700 విలువ చేసే మూడు ప్రయోజనాలను జియో అందిస్తోంది. ఈ ఆఫర్‌లు త్రైమాసిక రీఛార్జ్ ప్లాన్లు అయిన రూ. 899, రూ. 999లకు వర్తిస్తాయి. ఈ ప్లాన్‌లు వరుసగా 90 , 98 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఇవి 2GB రోజువారీ డేటాను కూడా అందిస్తాయి.

రూ. 3,599 వార్షిక ప్లాన్ రీఛార్జ్‌ చేసుకున్న వినియోగదారులు కూడా రూ.700 విలువ జేసే ఆఫర్స్‌ పొందడానికి అర్హులే. వారికి 365 రోజుల పాటు 2.5GB రోజువారీ డేటాతో పాటు రూ.700 విలువజేసే ఆఫర్స్‌ వర్తిస్తాయి. 
 

Reliance Jio 8వ వార్షికోత్సవ ఆఫర్స్‌ ఇవే..
జీ5, సోనీలైవ్‌, జియో సినిమా ప్రీమియమ్‌, లైన్స్‌గేట్‌ ప్లే, డిస్కవరీ ప్లస్‌, సన్‌నెక్ట్స్‌, ప్లానెట్‌ మరాఠీ, చౌపాల్‌, జియో టీవీ, Kanchha Lanka, Hoichoi, వంటి OTT యాప్‌లకు 28 రోజుల యాక్సెస్‌ను రిలయన్స్ జియో వార్షికోత్సవం సందర్భంగా అందిస్తోంది. దీని విలువ రూ. 175. దీనికి 28 రోజుల వ్యాలిడిటీ ఇచ్చారు. అంతేకాకుండా 10 GB డేటా ఇస్తున్నారు. 

అంతేకాకుండా ఉచితంగా మూడు నెలల Zomato గోల్డ్ సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. ఇది Ajio వోచర్‌ను కూడా ఇస్తోంది. రూ.2,999 అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులు ఫ్లాట్ రూ. 500 తగ్గింపు కూడా పొందవచ్చు. 
 

నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ ధర పెంపు..
ఇటీవల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల టారిఫ్‌లను జియో పెంచిన విషయం తెలిసిందే. అయితే వాటికి కాంప్లిమెంటరీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ ఇస్తోంది. ఇప్పుడు ఆ ప్రీపెయిడ్ ప్లాన్‌లు రేట్లను జియో పెంచింది. రూ.1,099 ప్లాన్ ను ఇప్పుడు రూ.1,299 కు పెంచింది. అదేవిధంగా  రూ. 1,499 ఉన్న ప్లాన్ ను ఇప్పుడు రూ. 1,799 పెంచింది. రూ. 1,299 ప్లాన్ తో మీరు కేవలం మొబైల్ ఫోన్లలో మాత్రమే నెట్‌ఫ్లిక్స్ ను యాక్సిస్ చేయగలరు. 
 

Latest Videos

click me!