రిలయన్స్ డిజిటల్ మళ్ళీ బంపర్ ఆఫర్స్ తో వినియోగదారుల ముందుకొచ్చింది. 5 ఏప్రిల్, 2025 నుంచి‘డిజిటల్ డిస్కౌంట్ డేస్’ సేల్స్ ను ప్రారంభించింది. ప్రతి సంవత్సరం పండగలు, సెలవుల సందర్భంగా ఆఫర్స్ ప్రకటించే రిలయన్స్ డిజిటల్ ఇప్పుడు వేసవి సెలవుల నేపథ్యంలో డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్స్ ను ప్రకటించింది.
ఎలక్ట్రానిక్స్ సేల్ కింద రిటైలర్ ప్రముఖ బ్యాంక్ కార్డులు, పేపర్ ఫైనాన్స్‌పై రూ.25,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 20 వరకు అన్నీ రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, రిలయన్స్ డిజిటల్. ఇన్(reliancedigital.in) ఆన్ లైన్ ప్లాట్ ఫాంలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్లు అన్ని ఎలక్ట్రానిక్స్ పై అందుబాటులో ఉన్నాయి.
ఎలక్ట్రానిక్ వస్తువులకు తగ్గట్టుగా సింపుల్ ఫైనాన్సింగ్, ఈఎమ్ఐలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను వేగంగా డెలివరీ చేస్తామని రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. వేసవిలో మీకు అవసరమైన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుగోలు చేసి మీ ఇంటిని అప్ గ్రేడ్ చేయాల్సిన టైమ్ వచ్చేసింది. ఎలాంటి వస్తువులపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.26,990 నుంచి ప్రారంభమయ్యే 1.5 టన్ను 3 స్టార్ ACలు, రూ.61,990 నుంచి ప్రారంభమయ్యే రిఫ్రిజిరేటర్లు, రూ.30,000 వరకు ప్రయోజనాలతో ల్యాప్‌టాప్‌లు డిస్కౌంట్ డేస్ సేల్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని అద్భుతమైన ఆఫర్‌లు ఉన్నాయి.
టీవీలు 60 శాతం వరకు తగ్గింపుతో లభిస్తాయి. వాటిలో 55” 4K గూగుల్ టీవీ కూడా కేవలం రూ.26,990కే లభిస్తుంది. వాషర్ డ్రైయర్లు రూ.49,990 నుంచే లభిస్తాయి. వాటితో పాటు రూ.3,000 విలువైన ఉచిత వస్తువులు మీరు పొందొచ్చు. మీరు ఈ ఆఫర్ సేల్ లో ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ను కేవలం రూ.537 ఈఎంఐ కడుతూ పొందొచ్చు. అదేవిధంగా ఆపిల్ వాచ్ సిరీస్ 10 నెలకు రూ.3,908 కే లభిస్తుంది.
ఇవే కాకుండా గృహోపకరణాలు, వంటగది ఉపకరణాలపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే ఉంటాయి. అంటే ఏప్రిల్ 20 వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ సేల్ అందుబాటులో ఉంటుంది.