Gold Rate: బంగారం ధర ఏకంగా రూ.16,500 పతనం అయ్యే అవకాశం..నమ్మబుద్ధి కావడం లేదా..అయితే అసలు కారణం ఇదే

First Published | Aug 28, 2023, 12:40 PM IST

అమెరికా ఫెడరల్ రిజర్వు భేటీ నేపథ్యంలో వడ్డీరేట్లు పెరుగుతాయని సూచనలు వినిపిస్తున్నాయి. దీంతో వడ్డీరేట్లతో ప్రత్యక్ష సంబంధం ఉన్నటువంటి బంగారం ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పసిడి ధరలు మార్కెట్లో భారీగా తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.

బంగారం ధరలు భారీగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా  అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజాగా  నిర్వహించిన భేటీలో వడ్డీ రేట్ల పెంపు కొనసాగవచ్చని పేర్కొంది.  దీంతో అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ పెరిగే అవకాశం కనిపిస్తోంది ఫలితంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం నుంచి అమెరికా ట్రెజరీ బాండ్ల వైపు తరలించే అవకాశం ఉంది ఫలితంగా బంగారంపై డిమాండ్ తగ్గి మరింత ధర తగ్గే అవకాశం ఉంది.  ప్రస్తుతం అమెరికాలో ఒక ఔన్సు 31 గ్రాముల బంగారం ధర 1915 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మే నెలలో ఇదే ధర 2050 డాలర్ల వరకూ వెళ్లింది. అక్కడి నుంచి బంగారం ధర ఏకంగా 160 డాలర్ల వరకూ తగ్గింది. 

వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన ఈ ప్రకటనతో  కోట్లాది మంది ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది. నిజానికి, పరిస్థితి మెరుగుపడకపోతే, వడ్డీరేట్లను  మరింత పెంచవచ్చని US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ అంటున్నారు. అమెరికా ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి కి తగ్గించాలని తాము నిర్ణయించుకున్నానని, అందువల్ల వడ్డీ రేట్లు కొంత కాలం పాటు పెరుగుతాయని ఫెడ్ ఛైర్మన్ చెప్పారు.


దీనితో పాటు, ఎగువ స్థాయి నుండి ద్రవ్యోల్బణంలో కొంత తగ్గుదల ఉందని, అయితే అది ఇంకా ఎక్కువగా ఉందని గణాంకాలను ఉటంకిస్తూ చెప్పారు. శుక్రవారం జాక్సన్ హోల్ వార్షిక సమావేశంలో జెరోమ్ పావెల్ ఈ ప్రకటన చేశారు.
 

ద్రవ్య విధానంలో కఠినత కారణంగా, వస్తువుల ధరలను తగ్గించడంలో ఇది సహాయపడిందని పావెల్ చెప్పారు. కరోనా తర్వాత సరఫరా ఆందోళనపై ఇది సానుకూల ప్రభావాన్ని చూపింది. అయితే, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి చాలా ప్రయత్నాలు అవసరమని, దానిపై కావాల్సిన  పని జరుగుతోందని ఆయన అన్నారు. అమెరికాలో 4 దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ద్రవ్యోల్బణం రేటు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ ద్రవ్యోల్బణం కోసం ఫెడ్ లక్ష్యం 2 శాతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. .

 అమెరికాలో వడ్డీ రేట్లు  పెరుగుతాయి అనే వార్తలతో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.  మరోవైపు ప్రపంచవ్యాప్తంగా డాలర్ ధర కూడా మరింత బలపడే అవకాశం కనిపిస్తుంది ఇది కూడా బంగారం ధరలను తగ్గించేందుకు ఉపయోగపడే అవకాశం ఉంది ఇదే కనుక కొనసాగినట్లయితే రాబోయే నెల రోజుల్లో  బంగారం ఒక ఔన్సు ధర 1915 డాలర్ల నుంచి ఏకంగా 1850 డాలర్లకు దిగివచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతే సుమారు 70 డాలర్లు తగ్గవచ్చు. ఈ లెక్కన చూసినట్లయితే మే నెలలో 2050 డాలర్ల నుంచి బంగారం ధర ఏకంగా 1850 డాలర్లు అంటే  గరిష్ట స్థాయి నుంచి సుమారు 200 డాలర్లు తగ్గే వీలుంది. భారతీయ  కరెన్సీలో దాదాపు 16,500 రూపాయలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. 
 

ఇక దేశీయంగా చూసినట్లయితే, ప్రస్తుతం బంగారం ధరలు 59 వేల రూపాయల రేంజ్ లో పలుకుతున్నాయి.  ఈ రేంజ్ లో గమనించినట్లయితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.  సుమారు 55000 దిగువకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర తగ్గి వచ్చే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఈ లెక్కన దసరా నాటికి బంగారం ధర భారీగా తగ్గవచ్చు.

Latest Videos

click me!