దిమాక్ ఖరాబ్ చేసే క్రేజీ ఫోన్‌.. 9000 mAh బ్యాట‌రీ, ధ‌ర ఎంతంటే.. వివరాలు ఇవిగో

Published : Feb 03, 2026, 09:00 AM IST

Redmi Turbo: రెడ్‌మీ టర్బో 5 మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల కానుంది . 9000 mAh బ్యాటరీతో పాటు 100 వాట్స్ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది. 6.67 ఇంచెస్ డిస్ప్లే, 1.5K రిసల్యూషన్, 144 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.  

PREV
15
రెడ్‌మీ టర్బో 5 మ్యాక్స్ మోడల్‌ను

స్మార్ట్ ఫోన్ రంగంలో సరికొత్త విప్లవానికి రెడ్‌మీ సిద్ధమైంది. ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న నేపథ్యంలో, వినియోగదారుల అవసరాలను తీర్చడానికి రెడ్‌మీ మరో నూతన మోడల్‌ను పరిచయం చేసింది. అసాధారణమైన బ్యాటరీ లైఫ్, అద్భుత పనితీరును కోరుకునే వినియోగదారుల కోసం రెడ్‌మీ టర్బో 5 మ్యాక్స్ మోడల్‌ను చైనా మార్కెట్లో అందుబాటులోకి తేనుంది.

25
దీని ధర సుమారు..

రెడ్‌మీ టర్బో 5 మ్యాక్స్ ఫోన్ ఫిబ్రవరి మొదటి వారంలో చైనాలో లాంచ్ కానుంది. దీని ధర సుమారు రూ. 33,000 వరకు ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ అత్యుత్తమ బ్యాటరీ పనితీరు, ఫ్లాగ్‌షిప్ స్థాయి స్పీడ్, మల్టీ టాస్కింగ్ సామర్థ్యంతో వస్తుందని రెడ్‌మీ కంపెనీ తెలిపింది. ఈ సిరీస్‌ను షియోమి 17 అల్ట్రా మోడల్‌తో పాటు లాంచ్ చేయవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

35
రెడ్‌మీ టర్బో 5 మ్యాక్స్

రెడ్‌మీ టర్బో 5 మ్యాక్స్ మొబైల్ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే, ఇది 6.67 ఇంచెస్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 1.5K రిసల్యూషన్‌ను అందిస్తుంది. అంతేకాకుండా, 144 Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తున్నారు. ఇది గేమింగ్, రోజువారీ వినియోగానికి సరిగ్గా సరిపోతుంది.

45
కెమెరా విషయానికి వస్తే

కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ బ్యాక్ కెమెరా 50 MP సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఇది అధిక నాణ్యత గల ఫోటోలను తీయడానికి సహాయపడుతుంది. సెల్ఫీల కోసం కూడా మంచి కెమెరా అందిస్తున్నట్లు రెడ్‌మీ పేర్కొంది.

55
ఫోన్ ప్రధాన ప్రత్యేకత

ఈ ఫోన్ ప్రధాన ప్రత్యేకత దాని బ్యాటరీ. రెడ్‌మీ టర్బో 5 మ్యాక్స్ భారీ 9000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది దీర్ఘకాలిక వినియోగానికి తోడ్పడుతుంది. బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేయడానికి, ఈ మొబైల్ ఫోన్‌కు 100 వాట్స్ ఉన్న చార్జర్ సపోర్ట్ చేయనుంది.

Read more Photos on
click me!

Recommended Stories