ఆర్‌బిఐ ప్రకటన : త్వరలోనే బిట్‌కాయిన్, డాగ్‌కోయిన్ కి పోటీగా ఇండియాలో కొత్త డిజిటల్ కరెన్సీ..

First Published Jul 23, 2021, 12:34 PM IST

భారతదేశంలో అలాగే విదేశాలలో డిజిటల్ కరెన్సీ వ్యామోహం పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో మార్కెట్లో డిజిటల్ కరెన్సీ (ఉదా.-బిట్‌కాయిన్, డాగ్‌కోయిన్, మొదలైనవి) పై పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. దీంతో తాజాగా డిజిటల్ కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుండి ఒక పెద్ద ప్రకటన వచ్చింది.  
 

ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ మాట్లాడుతూ ఆర్‌బిఐ సొంత డిజిటల్ కరెన్సీని దశలవారీగా ప్రవేశపెట్టే వ్యూహంలో పనిచేస్తోందని తెలిపారు. అలాగే ఆర్‌బిఐ దీనిని పైలట్ ప్రాతిపదికన హోల్‌సేల్, రిటైల్ రంగాల్లో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందని అన్నారు.
undefined
భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక కేంద్ర బ్యాంకులు ఈ దిశలో పనిచేస్తున్నాయి. ఇంకా ప్రభుత్వ హామీలు పొందని డిజిటల్ కరెన్సీలలో అస్థిరత స్థాయి నుండి వినియోగదారులను రక్షించాల్సిన అవసరం ఉందని ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ అన్నారు. అనేక దేశాల కేంద్ర బ్యాంకులు సిబిడిసిల అవకాశాన్ని అన్వేషిస్తున్నాయి. కొన్ని దేశాలు నిర్దిష్ట ప్రయోజనం కోసం సిబిడిసిని అమలు చేశాయి. ఆర్‌బిఐ, ఇతర కేంద్ర బ్యాంకుల మాదిరిగానే కొంతకాలంగా సిబిడిసిల వివిధ అంశాలను పరిశీలిస్తోంది.
undefined
'విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ' ఆన్‌లైన్ కార్యక్రమంలో టి.రవిశంకర్ మాట్లాడుతూ సిబిడిసి ఆలోచన త్వరలోనే అమలుకు దగ్గరగా ఉండవచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ పాలసీ అండ్ లీగల్ ఫ్రేమ్ వర్క్ ని పరిశీలించింది. అలాగే సిబిడిసిని దేశంలో డిజిటల్ కరెన్సీగా ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది.
undefined
" డిజిటల్ కరెన్సీని భవిష్యత్తులో హోల్‌సేల్ అండ్ రిటైల్ రంగాలలో దీనిని పైలట్ ప్రాతిపదికన అమలు చేయవచ్చు" అని రవి శంకర్ అన్నారు. అయితే, దీనికి చట్టపరమైన మార్పు అవసరం. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న నిబంధనలు కరెన్సీని భౌతికంగా దృష్టిలో ఉంచుకుని తయారు చేసింది. దీని ఫలితంగా నాణేల చట్టం, విదేశీ మారక నిర్వహణ చట్టం (ఎఫ్‌ఈ‌ఎం‌ఏ), సమాచార సాంకేతిక చట్టానికి సవరణలు అవసరం.
undefined
డిజిటల్ కరెన్సీ అనేది కరెన్సీ, డబ్బు, అస్సెట్స్ ని ఇంటర్నెట్ ద్వారా డిజిటల్ కంప్యూటర్ సిస్టం ద్వారా స్టోర్ చేయడం లేదా ఎక్స్ఛేంజ్ చేయడాన్ని డిజిటల్ కరెన్సీ అంటారు. సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన కరెన్సీని దేశ ప్రభుత్వం గుర్తింపు ఉంటుంది. భారతదేశం విషయంలో మీరు దీనిని డిజిటల్ రూపి అని కూడా పిలుస్తారు. డిజిటల్ రూపి రెండు రకాలు- రిటైల్ అండ్ హోల్ సేల్. రిటైల్ డిజిటల్ కరెన్సీని సాధారణ ప్రజలు, సంస్థలు ఉపయోగిస్తాయి. కాగా హోల్ సేల్ డిజిటల్ కరెన్సీని ఆర్థిక సంస్థలు ఉపయోగిస్తాయి.
undefined
click me!