సాధారణంగా ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కచ్చితంగా 18 ఏళ్లు నిండాలనే విషయం తెలిసిందే. సొంతంగా అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే తాజాగా 10 ఏళ్లు నిండిన వారు కూడా స్వతంత్రంగా బ్యాంకు ఖాతాలు తెరవడానికి అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో చిన్న పిల్లలు కూడా ఆర్థిక లావాదేవీల్లో భాగస్వామం కానున్నారు.
RBI
జూల్ 1, 2025 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకులు, రాష్ట్ర, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఈ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది.
అయితే బ్యాంక్ అకౌంట్ జారీ చేసే విషయంలో, ఖాతాల నిర్వహణ విషయంలో కొన్ని పరిమితులు, నిబంధనలు బ్యాంకులకు నిర్ణయించే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది. పిల్లల్లో చిన్న నాటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ అలవాటవుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రిస్క్ మేనేజ్‌మెంట్ పాలసీల ప్రకారం అకౌంట్‌లో జమ చేయగల గరిష్ట మొత్తం, నిర్వహించగల బ్యాలెన్స్, ఇతర లావాదేవీలపై పరిమితులు విధించవచ్చు. అలాగే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం/డెబిట్ కార్డులు, చెక్కు పుస్తకాల వంటి అదనపు సదుపాయాలను అందించే విషయంలోనూ బ్యాంకులు తమ విచక్షణను ఉపయోగించవచ్చని అధికారులు చెబుతున్నారు.
Reserve Bank of India (File Photo)
అయితే ప్రస్తుతం కూడా పదేళ్ల వయసున్న వారికి కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. అయితే వీటికి తల్లిదండ్రులు గార్డియన్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేరుగా మైనర్‌లు బ్యాంకు అకౌంట్‌ను కంట్రోల్ చేసుకునే అవకాశం కల్పించారు.
అలాగే 10 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న మైనర్లు వారి సహజ లేదా చట్టబద్ధమైన సంరక్షకుడి ద్వారా పొదుపు, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను తెరవడానికి, నిర్వహించడానికి అనుమతించవచ్చు.