Tata Nano EV
టాటా మోటార్స్ మరోసారి చౌకైన మధ్యతరగతి కారును మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈ కారు పెట్రోల్-డీజిల్‌తో కాకుండా విద్యుత్తుతో నడుస్తుంది, ఇది ఖర్చును కూడా తగ్గిస్తుంది. అదే టాటా నానో ఈవీ. రతన్ టాటా కలల కారుగా, పేదింటి కారుగా గుర్తింపు పొందిన టాటా నానో కారు మళ్లీ మార్కెట్ లోకి వస్తోంది. ఈ సారి సరికొత్త హంగులతో ముస్తాబవుతోంది. బాగా పాపులర్ అయిన టాటా నానో ఇప్పుడు టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారుగా మళ్ళీ తీసుకువస్తోంది. ఇది టాటా నానోకు ఎలక్ట్రిక్ వెర్షన్. ఇది ఇండియాలోనే చీప్ అండ్ బెస్ట్ కారు అవుతుందని అందరూ అనుకుంటున్నారు. టాటా నానో ఈవీ (TATA Nano EV) 2024 డిసెంబర్ లో ఇండియాలో లాంచ్ అవుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Tata Nano EV Design
రతన్ టాటా కలల కారు ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచాన్నే మార్చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. టాటా నానో ఇవి 17 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని సమాచారం. గంటకు 120 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లగలదు. ఇందులో 40 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. పలు రిపోర్టుల ప్రకారం.. డిజైన్ అద్భుతంగా ఉంటుంది. టాటా నానో ఈవీ ఒక కాంపాక్ట్ కారు. దీని పొడవు 3,164mm, వెడల్పు 1,750mm, వీల్ బేస్ 2,230mm, గ్రౌండ్ క్లియరెన్స్ 180mm ఉంటుంది. ఈ కారు 4 సీట్లను కలిగి ఉంటుంది, అంటే నలుగురు వ్యక్తులు ఈ కారులో సులభంగా ప్రయాణించగలరు.
Tata Nano EV Features
ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ, శక్తివంతమైన 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఈబీడీ తో కూడిన యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ వంటీ ఫీచర్లన్నీ ఉండనున్నాయి. ఇది 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 10 సెకన్లలోనే అందుకుంటుంది. ఏసీ, పవర్ స్టీరింగ్, ఎయిర్ బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టం లాంటి కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. రతన్ టాటా కలల కారుగా ఇదివరకు టాటా నానో ను టాటా మోటర్స్ లక్ష రూపాయల నుంచి మార్కెట్ లోకి తీసుకువచ్చింది. అయితే, కొత్త ఈవీ వెర్షన్ టాటా నానో ఎలక్ట్రిక్ కారు ధర 3.5 లక్షల బేస్ వేరియంట్ నుంచి 5 లక్షలకు పైగా కూడా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Tata Nano EV Battery and Range
ఈ కారు తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ తో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నారు. టాటా మోటార్స్, కోయంబత్తూరు కి చెందిన జయం ఆటోమోటివ్ కలిసి ఈ కారుని తయారు చేస్తున్నాయి. ఈ కారుని "ఎలక్ట్రా" అని పేరు పెట్టినట్టు సమాచారం. ఈ కారు 2024 చివరిలో ఇండియాలో లాంచ్ అవుతుందని అనుకుంటున్నారు.