ఒక్క టిక్కెట్ తో 56 రోజుల రైలు ప్రయాణం..ఇండియన్ రైల్వే సర్క్యులర్ టికెట్ గురించి తెలుసా?

First Published | Aug 29, 2024, 4:45 PM IST

56 days train journey with one ticket : ఇండియన్ రైల్వే సర్క్యులర్ ఒక్క టికెట్ తో 56 రోజులు రైలు ప్రయాణం చేయవచ్చు. ఒకే మార్గంలో కాకుండా 8 వేర్వేరు రైలు స్టేషన్లకు ప్రయాణించవచ్చు. ఆ వివరాలు మీకోసం.. 

56 days train journey with one Single Ticket: Indian Railway Circular Ticket

56 days train journey with one ticket : భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఇండియన్ రైల్వే వెలుగొందుతోంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఇండియన్ రైల్వే అనేక రకాల వసతులను కల్పిస్తోంది. సాధారణంగా దూర ప్రయాణాలలో రైలులో ప్రయాణం చేసేటప్పుడు ముందస్తుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. 

56 days train journey with one Single Ticket: Indian Railway Circular Ticket

అలాగే, మళ్ళీ మళ్ళీ టికెట్లు కొనుగోలు చేసే ఇబ్బంది లేకుండా రైలులో ప్రయాణం చేయాలనుకుంటే, దానికోసం ప్రత్యేక టికెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో దేశం మొత్తం రైలు ప్రయాణం చేయవచ్చు. అదే సర్క్యులర్ టికెట్. ట్రైన్ సర్క్యులర్ ట్రావెల్ టికెట్ అనేది భారతీయ రైల్వే ద్వారా అందించబడే ఒక ప్రత్యేక టికెట్. ఒకే టికెట్ తో 56 రోజుల వరకు ప్రయాణించవచ్చు.


56 days train journey with one Single Ticket: Indian Railway Circular Ticket

సర్క్యులర్ ట్రావెల్ టికెట్ పొందడం ద్వారా ఒక ప్రయాణికుడు ఒకే టికెట్ తో 8 వేర్వేరు రైలు స్టేషన్లకు ప్రయాణించవచ్చు. అయితే, ఈ టికెట్లను టికెట్ కౌంటర్లలో నేరుగా కొనుగోలు చేయలేరు. వెబ్‌సైట్ లేదా టికెట్ కౌంటర్ ద్వారా సర్క్యులర్ టికెట్లను బుక్ చేసుకోలేరు. సర్క్యులర్ ట్రావెల్ టికెట్ పొందడానికి ముందుగా జోనల్ రైల్వేకి దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.

56 days train journey with one Single Ticket: Indian Railway Circular Ticket

మీరు ఎక్కువ రోజులు రైలు ప్రయాణం లేదా పర్యాటక ప్రాంతాలను వీక్షించే పనిలో ఉంటే అనేక స్టాప్‌ల నుండి టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. బదులుగా ఈ ఒక్క టికెట్ తీసుకుంటే సరిపోతుంది. మీ ప్రయాణం మరింత సులభం అవుతుంది. ఈ టిక్కెట్ కోసం మీరు ముందుగా రైల్వేకి మీ ప్రయాణ వివరాలు తెలియజేయాల్సి వుంటుంది. అంటే మీరు సర్క్యులర్ టికెట్ కొనుగోలు చేసినప్పుడు, మీ ప్రయాణం ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుంది వంటి వివరాలు జోనల్ రైల్వేకు అందించాలి. 

56 days train journey with one Single Ticket: Indian Railway Circular Ticket

మీ షెడ్యూల్ ప్రకారం సర్క్యులర్ ట్రావెల్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. సర్క్యులర్ టికెట్ పొందడం ద్వారా, అనేక స్టేషన్లలో మళ్ళీ మళ్ళీ టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం వుండదు. ఇది సమయాన్ని మాత్రమే కాకుండా డబ్బును కూడా ఆదా చేస్తుంది. వేర్వేరు రైలు స్టేషన్లలో టికెట్లు కొనుగోలు చేసినప్పుడు ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. అయితే, సాధారణ పాయింట్ టు పాయింట్ ఛార్జీల కంటే తక్కువ ధరలో సర్క్యులర్ టికెట్లు లభిస్తాయి. 

56 days train journey with one Single Ticket: Indian Railway Circular Ticket

ఈ సర్క్యులర్ టికెట్‌ని ఉపయోగించి ఎనిమిది స్టేషన్లకు ప్రయాణించవచ్చు. దీని వ్యాలిడిటీ 56 రోజులు ఉంటుంది. అవసరమైతే, జోన్  డివిజనల్ కమర్షియల్ మేనేజర్ లేదా కొన్ని ప్రధాన స్టేషన్ల స్టేషన్ మాస్టర్‌ను సేవల కోసం సంప్రదించవచ్చు. దాదాపు దేశంలోని అన్ని రైల్వే ప్రాంతాలను ఈ టిక్కెట్ తో సందర్శించవచ్చు. అయితే, వీటి ధరలు భిన్నంగా ఉంటాయి. ఆ వివరాలు రైల్వే జోనల్ అధికారులు అందిస్తారు.  

Latest Videos

click me!