Rainbow Children's Medicare IPO: ఉసూరు మనిపించిన రెయిన్ బో హాస్పిటల్ ఐపీవో, ఇన్వెస్టర్లకు 6 శాతం నష్టం

Published : May 10, 2022, 02:21 PM IST

ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ పీడియాట్రిక్, గైనకాలజీ హాస్పిటల్ చైన్ ఆపరేటర్ రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ (Rainbow Children’s Medicare IPO) షేర్లు నేడు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. అయితే ఇన్వెస్టర్లకు లిస్టింగ్ వేళ ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఇష్యూ ధరపై 6.6 శాతం తరుగుదలతో రూ. 506 వద్ద లిస్ట్ అయ్యాయి. బిఎస్‌ఇలో ఇష్యూ ధర రూ.542కి ప్రతిగా షేరు రూ.506 వద్ద ప్రారంభమైంది, ఎన్‌ఎస్‌ఇలో లిస్టింగ్ ధర రూ.510 వద్ద లిస్ట్ అయ్యింది.

PREV
14
Rainbow Children's Medicare IPO: ఉసూరు మనిపించిన రెయిన్ బో హాస్పిటల్ ఐపీవో, ఇన్వెస్టర్లకు 6 శాతం నష్టం

మల్టీ-స్పెషాలిటీ పీడియాట్రిక్ మరియు గైనకాలజికల్ హాస్పిటల్ చైన్ రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్  (Rainbow Children’s Medicare) మంగళవారం స్టాక్ మార్కెట్‌లో బలహీనమైన లిస్టింగ్‌ తో ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ షేరు BSEలో రూ. 506 వద్ద లిస్ట్ అయ్యింది. అయితే దీని ఇష్యూ ధర రూ. 542గా నమోదైంది.  అంటే లిస్టింగ్‌లో ఈ  స్టాక్ పెట్టుబడిదారులకు ప్రతి షేరుకు రూ. 36 నష్టాన్ని ఇచ్చింది. రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ NSEలో రూ. 510కి లిస్ట్ అయ్యింది.  

24

ఈ IPO మదుపరుల నుండి చాలా మంచి స్పందనను పొందింది. దాదాపు 12 టైమ్స్ సబ్ స్క్రిప్షన్ పొందింది. ఈ IPOలో 50 శాతం QIBల కోసం రిజర్వ్ చేశారు. ఈ కేటగిరీలో 38.90 రెట్లు బిడ్లు వచ్చాయి. ఇందులో 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు 1.38 రెట్లు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం 15 శాతం రిజర్వ్ చేశారు. IPO ఈ భాగానికి బిడ్ కంటే 3.73 రెట్లు వచ్చింది.
 

34

ఈ ఐపీఓ ద్వారా రూ.1581 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ ఉద్దేశం. ఈ IPO ఏప్రిల్ 27 నుండి ఏప్రిల్ 29 వరకు తెరిచి ఉంచారు. ఈ IPO యొక్క ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 516-542. లాట్ పరిమాణం 27 షేర్లు. ఇష్యూ నుండి వచ్చే నిధులు నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్‌సిడిలు), కొత్త ఆసుపత్రుల నిర్మాణం, మూలధన వ్యయం, ఇప్పటికే ఉన్న ఆసుపత్రుల కోసం వైద్య పరికరాల కొనుగోలు, సాధారణ కార్పొరేట్ వ్యవహారాల కోసం వినియోగిస్తారు.

44

20 డిసెంబర్ 2021 నాటికి, రెయిన్‌బో దేశంలోని ఆరు నగరాల్లో 14 ఆసుపత్రులు, 3 క్లినిక్‌లను కలిగి ఉంది. కంపెనీ మొత్తం పడకల సామర్థ్యం 1500. రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ పిల్లలకు సంబంధించిన అన్ని ఆరోగ్య సమస్యలు, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన సమస్యలకు చికిత్సను అందిస్తుంది. అలాగే సంతానోత్పత్తి సంరక్షణ వంటి సేవలను అందిస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ లాభం రూ.126.41 కోట్లు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ లాభం రూ. 39.57 కోట్లు. 2019-20లో లాభం రూ. 55.34 కోట్లుగా ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories