రాధాకిషన్ దమానీ ఎవరు?
D-Mart లో D అంటే దమానీ. ఈ వ్యాపారసంస్థ యజమాని రాధాకిషన్ దమాని. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 స్టోర్స్ తో డిమార్ట్ విజయవంతంగా కొనసాగుతోంది. దీంతో ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనికుల జాబితాలో దమానీ 85వ స్థానంలో నిలిచారు. అతని నికర ఆదాయం 2300 కోట్లకు చేరువలో ఉంది
2015 డిసెంబర్‌లో రాధాకిషన్ దమానీ పోర్ట్‌ఫోలియో నికర విలువ కేవలం రూ.1531 కోట్లు. సెప్టెంబర్ 2024 నాటికి అంటే దాదాపు 9 సంవత్సరాలలో అతని ఆస్తులు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు అతని పోర్ట్‌ఫోలియో రూ.2.38 లక్షల కోట్లు.
దమానీ వందలాది కంపెనీలలో షేర్లను కలిగిలేడు. అతను తన 13 సొంత కంపెనీల షేర్లను మాత్రమే కలిగి ఉన్నాడు. వీటి విలువే రూ.238,385 కోట్లు. అతని వద్ద ఉన్న టాప్ 10 షేర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దమానీ పోర్ట్‌ఫోలియో
అవెన్యూ సూపర్మార్ట్స్: ఇది రాధాకిషన్ దమానీకి చెందిన కంపెనీ... ఇదే డి-మార్ట్ చైన్‌ను కలిగి ఉంది. జూన్ 2024 నాటికి దమానీ ఈ కంపెనీలో 67.2 శాతం వాటాను కలిగి ఉన్నారు. అంటే 2.31 లక్షల కోట్ల విలువైన 4.37 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. మార్చి 2023లో అతను 0.3 శాతం వాటాను విక్రయించారు.
ట్రెంట్ లిమిటెడ్ టాటా గ్రూప్ యొక్క రిటైల్ కంపెనీ. ఈ కంపెనీలో దమానీ రూ.3222 కోట్ల విలువైన 45 లక్షల షేర్లను కలిగి ఉన్నారు. ప్రస్తుతం ట్రెంట్ యొక్క ఒక షేరు ధర రూ.7148.
దమానీ స్టాక్ విలువ
సుందరం ఫైనాన్స్ లిమిటెడ్: 70 సంవత్సరాల క్రితం టి.ఎస్.సంతానం స్థాపించిన సుందరం ఫైనాన్స్ లిమిటెడ్‌లో దమానీ చాలా సంవత్సరాలుగా షేర్లను కలిగి ఉన్నారు. 1216 కోట్ల విలువైన 26.30 లక్షల షేర్లను కలిగి ఉన్నారు.
దేశంలోని ప్రముఖ బీర్ తయారీదారు యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్‌లో కూడా దమానీ పెట్టుబడి పెట్టారు. రూ.659 కోట్ల విలువైన రూ.31.67 లక్షల షేర్లను కలిగి ఉన్నారు. కంపెనీలో 1.2% వాటాను కలిగి ఉన్నారు.
దమానీ హోల్డింగ్స్
పారిశ్రామిక తయారీ సంస్థ 3M ఇండియాలో రాధాకిషన్ దమానీ రూ.585.7 కోట్ల విలువైన 1.66 లక్షల షేర్లను కలిగి ఉన్నారు. రాధాకిషన్ దమానీ ఇటీవల బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్‌లో తన వాటాను విక్రయించారు. 0.1 శాతం వాటాను విక్రయించారు. ప్రస్తుతం రూ.230 కోట్ల విలువైన 2.81 లక్షల షేర్లను కలిగి ఉన్నారు.
వీఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే పొగాకు కంపెనీ షేర్లను దమానీ కేవలం 85 రూపాయలకు కొనుగోలు చేశారు. నేడు ఈ కంపెనీ విలువ రూ.226.9 కోట్లు. దీనిలో 53.51 లక్షల విలువైన షేర్లను దమానీ కలిగి ఉన్నారు.
దమానీ నికర విలువ
భగీరథ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే వ్యవసాయ రసాయన సంస్థలో కూడా దమానీ వాటాను కలిగి ఉన్నారు. ఈ సంస్థలో 168.4 కోట్ల విలువైన 43.06 లక్షల షేర్లను కలిగి ఉన్నారు.
సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే పెట్టుబడి సంస్థలో దమానీ రూ.160.4 కోట్ల విలువైన 41.70 లక్షల షేర్లను కలిగి ఉన్నారు.