బ్యాంక్ రూల్స్ లో మార్పులు.. కస్టమర్లపై పెరగనున్న మరింత భారం.. జనవరి 15 నుండి అమల్లోకి..

First Published Jan 7, 2022, 5:57 PM IST

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కొత్త సంవత్సరంలో ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. దేశంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన వివిధ సర్వీస్ ఛార్జీలను(service charges) పెంచింది. ఈ మార్పులు 15 జనవరి 2022 నుండి వర్తించనుంది.

 పొదుపు ఖాతాలో తప్పనిసరి
బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మెట్రో ప్రాంతం లేదా పట్టణ ప్రాంతాల్లో నివసించే కస్టమర్‌లు మీ సేవింగ్స్ ఖాతాలో కనీసం 10,000 వేల  బ్యాలెన్స్ ఉండాలి. ఇంతకుముందు రూ.5000 ఉండగా ప్రస్తుతం బ్యాంకు రూ.10,000కు పెంచింది. ఇంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు రూ.600 చార్జీ చెల్లించాల్సి ఉండగా గతంలో రూ.300 ఉండేది. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల కస్టమర్లు మినిమం బ్యాలెన్స్ కంటే తక్కువ  ఉంటే ప్రతి త్రైమాసికానికి రూ.200 బదులు ఇప్పుడు రూ.400 చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. 

లాకర్ ఫీజులో మార్పులు 
పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ తో  పాటు లాకర్ ఛార్జీలలో కూడా పి‌ఎన్‌జి మార్పులు చేసింది. దీని ప్రకారం ఎక్స్‌ఎల్ పరిమాణంలోని లాకర్లు మినహా అన్ని రకాల లాకర్లకు అధిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అర్బన్, మెట్రోపాలిటన్ నగరాల్లో లాకర్ ఛార్జీలను రూ.500కు పెంచారు. చిన్న సైజు లాకర్ చార్జీ గతంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000 ఉండగా దాన్ని రూ.1250కి పెంచారు. కాగా పట్టణ ప్రాంతాల్లో రూ.1,500 నుంచి రూ.2,000కు పెంచారు. దీంతో మీడియం సైజ్ లాకర్ చార్జీ గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,000 నుంచి రూ.2,500కి పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో రూ.3 వేల నుంచి రూ.3,500కి పెరిగింది. మరోవైపు పెద్ద లాకర్ల గురించి మాట్లాడితే గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 నుంచి రూ.3,000, పట్టణ ప్రాంతాల్లో రూ.5,000 నుంచి రూ.5,500 వరకు పెరిగింది. 

లాకర్ విజిత్ సంఖ్య 15 నుండి 12కి తగ్గించబడింది
బ్యాంక్ లాకర్ ఛార్జీల మార్పుతో పంజాబ్ బ్యాంక్ లాకర్ విజిట్ సంఖ్య కూడా తగ్గింది. మీరు ఇప్పుడు సంవత్సరంలో 12 సార్లు లాకర్‌ని సందర్శించవచ్చు. దీని తర్వాత ప్రతి విజిట్ పై రూ. 100 అదనపు చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు లాకర్ విజిట్ సౌకర్యం 15 సార్లు అందుబాటులో ఉండటం గమనార్హం. 
 

హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు శుభవార్త
పిఎన్‌బి అలాగే ప్రైవేట్ రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్‌స్టా అలర్ట్ సర్వీస్ ఛార్జ్‌లో మార్పులు చేశాయి. హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఇమెయిల్ లేదా ఎస్‌ఎం‌ఎస్ ద్వారా ఇన్‌స్టా అలర్ట్ సేవలకు ఛార్జీలను మార్చబడింది. ఇన్‌స్టా అలర్ట్ ఎస్‌ఎం‌ఎస్ సర్వీస్ కోసం కస్టమర్‌లు త్రైమాసికానికి రూ. 3 చెల్లిస్తున్నట్లయితే  ఇప్పుడు ప్రతి ఎస్‌ఎం‌ఎస్ కు 20 పైసలతో జి‌ఎస్‌టిని చెల్లిస్తారు. అలాగే ఇమెయిల్ అలెర్ట్ లకు ఎటువంటి ఛార్జీ ఉండదు. ఈ మార్పులు 1 జనవరి 2022 నుండి అమలులోకి వచ్చాయి.

click me!