లెటర్ రాయండి.. రూ.50,000 గెలుచుకోండి!

First Published Sep 22, 2024, 12:29 PM IST

ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ‘లెటర్ రైటింగ్ కాంపిటేషన్’ నిర్వహించనుంది. భారతీయ తపాలా శాఖ ఈ పోటీని జాతీయ స్థాయిలో నిర్వహించనుంది.  పోటీలో పాల్గొనే వారికి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు నగదు బహుమతులు అందజేయనున్నారు. కాంపిటిషన్ లో పాల్గొనాలంటే అర్హులు ఎవరు, ఎలాంటి లెటర్స్ రాయాలి తదితర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

మీరు మీ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి ఉత్తరాలు రాసి ఎంత కాలం అయ్యిందో గుర్తుందా? మనమందరం మర్చిపోయిన విషయం ఏమిటంటే పోస్టల్ డిపార్ట్ మెంట్ ఇప్పటికీ లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోందని. చాలా మందికి పోస్టల్ డిపార్ట్ మెంట్ అంటే గ్రామాల్లో నివసించే ప్రజలకు అందుబాటులో ఉండే బ్యాంకు లాంటి వ్యవస్థ అనే అనుకుంటారు. కాని ఒకప్పుడు ప్రజల మధ్య కమ్యూనికేషన్ కి ఉన్న ఏకైక మీడియం పోస్టాఫీస్. ఇప్పుడంటే సెల్ ఫోన్లు అంతకు మించిన టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి కాని సుమారు 2000 సంవత్సరం వరకు కూడా ఉత్తరాల కమ్యూనికేషన్ జరిగింది. ఇండియాలో ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో ఉత్తరాలు రాసుకొని పోస్ట్ చేస్తుంటారు. 

ప్రజల్లో మళ్లీ లెటర్స్ కమ్యూనికేషన్ పెంచాలన్న సదుద్దేశంతో భారతీయ తపాలా శాఖ లైటర్ రైటింగ్ కాంపిటేషన్ ను నిర్వహిస్తోంది. 

భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఉత్తర రచన పోటీ-2024 సెప్టెంబర్ 14వ తేదీ నుంచి వచ్చే డిసెంబర్ 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తపాలా శాఖ నిర్వహిస్తున్న ఈ పోటీలో పాల్గొనడానికి మినిమం 18 సంవత్సరాలు దాటి ఉండాలి.  'రాయడంలో ఆనందం, డిజిటల్ యుగంలో ఉత్తరాల ప్రాముఖ్యత' అనే అంశంపై ఈ పోటీ నిర్వహిస్తున్నారు. మీరు ఈ పోటీలో పాల్గొనాలనుకుంటే ఇంగ్లీష్, హిందీ, తమిళం భాషల్లో ఏదైనా ఒక భాషలో రాయవచ్చు.

Latest Videos


మీరు ఇన్‌ల్యాండ్ లెటర్‌లో ఉత్తరం రాయాలనుకుంటే 500 పదాలకు మించకుండా రాసి పంపాలి. పేపర్ పై రాసి కవరులో పెట్టి పంపాలను మీరు అనుకుంటే కనీసం 1000 పదాలకు మించకుండా రాసి పంపవచ్చు. రెండు రకాల ఉత్తరాలు స్వయంగా చేతి రాత(hand writing)తో రాసినవి అయి ఉండాలి. ఇది అతి ముఖ్యమైన కండీషన్. పొరపాటున మీరు టైప్ చేసి పంపిస్తే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు.

పోటీలో పాల్గొనడానికి వయోపరిమితి లేనప్పటికీ '1.1.2024 నాటికి 18 సంవత్సరాలు నిండినవారు అయి ఉండాలి. మీ వయస్సు ధ్రువపత్రాన్ని(age certificate) తప్పనిసరిగా ఉత్తరంతో పాటు జత చేయాలని తపాలా శాఖ ప్రకటనలో పేర్కొంది. పోటీలో పాల్గొనేవారి పేరు, అడ్రస్ ఉత్తరంలో తప్పకుండా పేర్కొనాలి.

ఉత్తరాన్ని 'చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తమిళనాడు సర్కిల్, చెన్నై - 600002' అనే చిరునామాకు, 'సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, నెల్లై పోస్టల్ డివిజన్, నెల్లై- 627002' అనే చిరునామా ద్వారా పంపాలి. ఎంపికైన ఉత్తమ ఉత్తరాలకు జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ నగదు బహుమతులు లభిస్తాయి.

రాష్ట్ర స్థాయిలో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.25,000, ద్వితీయ బహుమతిగా రూ.10,000, తృతీయ బహుమతిగా రూ.5,000 అందజేస్తారు. జాతీయ స్థాయిలో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.50,000, ద్వితీయ బహుమతిగా రూ.25,000, తృతీయ బహుమతిగా రూ.10,000 బహుమతిగా అందజేస్తారు. ఉత్తర రచన పోటీలో ప్రజలు, విద్యార్థులు అందరూ పాల్గొనాలని తపాలా శాఖ కోరుతోంది.

click me!