భారతదేశంలో అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు PMV EaS-E రికార్డుల్లోకెక్కనుంది. దీని ధర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉండనుంది. ఇప్పటికే టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ త్వరలో మార్కెట్ లోకి రానుంది. దీని ధర రూ. 5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు టాటా నానో ధర కంటే తక్కువ ధరకు PMV EaS-E లభించనుంది. సిటీ ట్రాఫిక్ కష్టాలను తొలగించేలా సిటీలో ఈజీ మూవింగ్ కోసం ప్రత్యేకంగా ఈ కారు తయారుచేశారు.
PMV EaS-E ఎలక్ట్రిక్ కారులో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. 2915 మి.మీ. పొడవు ఉంటుంది. ఈ కారు మీరు బుక్ చేయాలనుకుంటే కేవలం రూ. 2000 టోకెన్ తీసుకొని బుకింగ్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 బుకింగ్‌లను సాధించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ EV కారు భారతదేశంలో అత్యంత తక్కువ ధర ఉన్న ఎలక్ట్రిక్ కారుగా మారింది.
సిటీ-సెంట్రిక్ EV 13.6PS, 50Nm మేకింగ్ చేసే ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఇందులో ఉంది. 48 వోల్ట్ బ్యాటరీ ఈ కారు వేగంగా ఛార్జింగ్ అవడానికి సహాయపడుతుంది. ఇది మూడు రేంజ్ ఫిగర్‌లతో వస్తుంది. ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ, 160 కి.మీ., 200 కి.మీ. దూరం ప్రయాణించే విధంగా బ్యాటరీ కెపాసిటీని మార్చుకొనే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా గంటకు 70 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది.
PMV EaS-E కారు చాలా చిన్న సైజులో ఉంటుంది. EVకి బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, LCD డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, LED హెడ్‌ల్యాంప్‌లు, డోర్ లాక్/అన్‌లాక్, విండోస్, AC కోసం రిమోట్ వెహికల్ ఫంక్షన్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
మైక్రో సెగ్మెంట్, EaS-E మోడ్, ఆటో లాక్, క్లచ్, గేర్‌బాక్స్ లేవు.
ఇందులో టచ్‌స్క్రీన్ ఫెసిలిటీ ఉంది. సింపుల్ స్టీరింగ్ నడిపే వారికి చాలా ప్లెక్సిబుల్ గా ఉంటుంది. బడ్జెట్ లో లభించే కారు కాబట్టి అందరికీ ఇష్టంగా మారుతుంది. ఎల్‌ఈడీ లైట్లు, అల్లాయ్ వీల్స్ ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణ.
భద్రత పరంగా చూస్తే ఇది ప్రయాణీకులకు సీట్‌బెల్ట్‌లు ఇస్తున్నారు. డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ ఉంది. క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్ కోసం వెనుక కెమెరాను కూడా రూపొందించారు. ఇది MG Air EV కి ప్రత్యామ్నాయం రూపొందిన కారు అని చెప్పొచ్చు.
అదనపు ఫీచర్లుగా రిమోట్ పార్కింగ్ ఫెసిలిటీ ఇచ్చారు. AC, OTA అప్‌డేట్స్ ఇస్తున్నారు. బ్రేకింగ్ సిస్టమ్ చాలా బెటర్ గా ఇచ్చారు. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 4 గంటలు ఛార్జింగ్ చేస్తే సరిపోతుంది.