ప్రధానమంత్రి స్వనిధి పథకం: కేంద్ర ప్రభుత్వం నేరుగా మీ ఖాతాకు రూ.10 వేలు పంపుతుంది, ఈ చిన్న పని చేస్తే చాలు

First Published Dec 29, 2021, 2:24 PM IST

 సమాజంలోని వివిధ వర్గాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం(central government) అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. దీని కింద ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు, ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఈ పథకాలలో ప్రధానమంత్రి స్వనిధి యోజన (pradanmantri swanidhi yojana)ఒకటి. దీని కింద వీధి వ్యాపారులు(street vendors), తోపుడు బండ్లు తదితరాలను ఏర్పాటు చేసుకునే వీధి వ్యాపారులకు రూ.10 వేలు రుణం ఇస్తారు.

 ప్రధాన్ మంత్రి స్వనిధి యోజన  పథకం కింద కరోనా కాలంలో ప్రభావితమైన లేదా ఉపాధి కోల్పోయిన వ్యక్తులకు సహాయం అందించబడుతుంది. వాస్తవానికి, కరోనా  వైరస్ వ్యాప్తి  రోజు వేతన కార్మికులపై తీవ్రమైన  ప్రభావం చూపింది. కొంతమంది వీధి వ్యాపారాలు పెట్టుకుని వారి కుటుంబాలు జీవించేవారు, కానీ ఇప్పుడు వారు వ్యాపారం తిరిగి ఇంకా ప్రారంభించలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఇటువంటి వారికి తిరిగి ఉపాధిని ప్రారంభించడానికి సహాయం అందిస్తుంది. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం...

ప్రధానమంత్రి స్వనిధి యోజన అంటే ఏమిటి 
ఈ పథకం ప్రయోజనం రోడ్డు పక్కన హ్యాండ్‌కార్ట్‌లు, తోపుడు బండ్లు, తినుబండరాలు మొదలైనవి పెట్టి తమను ఇంకా వారి కుటుంబాలను పోషిస్తున్నవారికి అందుబాటులో ఉంటుంది. దీని కింద రూ.10,000 వరకు రుణం తీసుకోవచ్చు. 

పి‌ఎం స్వానిధి యోజనకు సంబంధించిన ప్రత్యేక విషయాలు 
ఈ పథకం కింద రుణగ్రహీత మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయడం అవసరం. 
24 మార్చి 2020న లేదా అంతకు ముందు ఇటువంటీ వీధి వ్యాపారంలో నిమగ్నమై ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ లోన్ అందుబాటులో ఉంటుంది. 
ఈ స్కీమ్ కింద రుణం తీసుకునే వ్యవధి మార్చి 2022 వరకు మాత్రమే ఉంది, కాబట్టి దాని ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి. 
పట్టణ లేదా సెమీ అర్బన్, గ్రామీణ, వీధి వ్యాపారులు ఈ రుణాన్ని పొందవచ్చు. 

గ్యారెంటీ ఫ్రీ లోన్ 
ప్రభుత్వం ఈ పథకం కింద వీధి వ్యాపారులు ఒక సంవత్సరానికి పది వేల రూపాయల వరకు ఉచిత రుణాన్ని పొందవచ్చు. అంటే ఈ పథకంలో మీరు రుణం తీసుకోవడానికి ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అతిపెద్ద విషయం ఏమిటంటే, మీరు రుణాన్ని నెలవారీ వాయిదాలలో చెల్లించవచ్చు. 

పి‌ఎం స్వానిధి యోజనలో ఎంత సబ్సిడీ లభిస్తుంది?
రుణగ్రహీతలు ఈ రుణాన్ని ఏడాదిలో వాయిదాల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో రుణం చెల్లించే వారికి వార్షిక వడ్డీ రాయితీ 7 శాతం వారి ఖాతాకు బదిలీ చేయబడుతుంది. 
 

click me!