Petrol Pump Scams: జీరో నుంచి పెట్రోల్ కొట్టినా మోసమేనా? బంకుల్లో బయటపడిన జంప్ స్కామ్

Published : Feb 18, 2025, 04:41 PM ISTUpdated : Feb 18, 2025, 04:43 PM IST

Petrol Pump Scams: పెట్రోల్ బంకుల్లో కొత్త మోసం బయట పడింది. ఆపరేటర్ జీరో నుంచి పెట్రోల్ కొట్టినా అందులోనూ మోసం జరుగుతోందని కొందరు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిని బట్టి కొన్ని పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న 'జంప్ ట్రిక్' మోసం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

PREV
15
Petrol Pump Scams: జీరో నుంచి పెట్రోల్ కొట్టినా మోసమేనా? బంకుల్లో బయటపడిన జంప్ స్కామ్

మనం పెట్రోల్ బంకుకు వెళ్లగానే పెట్రోల్ కొట్టే ఆపరేటర్ ఏమంటారు.. "దయచేసి జీరో ఉందో లేదో చూడండి’’ అంటారు కదా.. జీరో నుంచి స్టార్ట్ చేసి పెట్రోల్ కొడుతున్నారు కాబట్టి మోసం జరగడం లేదని  అనుకుంటాం. కాని ఇక్కడే జంప్ ట్రిక్ మోసం జరుగుతోంది. 

 

25

జంప్ ట్రిక్ మోసం అంటే..

పెట్రోల్ కొట్టే మీటర్ రీడింగ్ జీరో వద్ద ప్రారంభమైనప్పటికీ వెంటనే 10, 20 రూపాయలకు డైరెక్ట్ గా రీడిండ్ జంప్ అయిపోతుంది. ఆ తర్వాత నార్మల్ స్పీడ్ తో మీటర్ తిరుగుతుంది. ఇది గుర్తించడం చాలా కష్టం. ఈ జంప్ ట్రిక్ మోసాన్ని తెలియజేస్తూ కొందరు ఇంటర్నెట్‌లో వీడియోలు పోస్టు చేశారు.

 

35
యంత్ర నియంత్రణ:

ఈ మోసం ఎలా చేస్తారు..

పెట్రోల్ పంపింగ్ మిషన్ ని ఈ విధంగా సెట్ చేసి మోసం చేస్తారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇలా ముందే మీటర్స్ ని సెట్ చేసి ఉంచుతారు. ఇలా చేయడం వల్ల జీరో నుంచి డైరెక్ట్ గా రూ.10, రూ.20 మీటర్ రీడింగ్ చూపిస్తుంది. మనం గమనించే లోపే రీడింగ్ స్పీడ్ గా తిరిగేస్తుంది. 

45

మీటర్ ఎలా పనిచేయాలి

పెట్రోల్ పంపు మీటర్ సరిగ్గా పనిచేయడం అంటే జీరో నుంచి రీడింగ్ మొదలైతే 1, 2, 4, 7, 10 ఇలా నెమ్మదిగా రీడింగ్ పెరగాలి. నేరుగా రూ.10, రూ.20 చూపించిందంటే ఆ మీటర్ తప్పు తిరుగుతోందని గుర్తించాలి. ఇలా మోసం చేయడం చట్టవిరుద్ధం. మీ సమీపంలో ఇలాంటి మోసాలు జరిగితే వెంటనే అధికారులకు కంప్లయింట్ చేయండి. 

 

55

మోసపోకుండా ఉండాలంటే.. 

పెట్రోల్ నింపడం ప్రారంభించినప్పటి నుంచి మీటర్‌ను జాగ్రత్తగా గమనించండి. ఏ స్టేజ్ లో అయినా మీటర్ స్పీడ్ గా రన్ అయినట్లు కనిపిస్తే వెంటనే ఆపరేటర్‌ను ప్రశ్నించండి. పెట్రోల్ నెమ్మదిగా కొట్టాలని సూచించండి. 

అన్ని పెట్రోల్ బంకుల్లో ఇలాంటి మోసాలు జరగకపోవచ్చు. కాని అలాంటివి మీరు గుర్తిస్తే వెంటనేే ప్రశ్నించండి. అధికారులకు ఫిర్యాదు చేయండి. 

click me!

Recommended Stories