వాహనదారులపై ఇంధన ధరల పిడుగు.. రోజురోజుకి షాకిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు..

First Published Oct 27, 2021, 11:18 AM IST

 రెండు రోజుల విరామం తర్వాత నేడు ఇంధన ధరలు(fuel prices) మళ్ళీ పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం రికార్డు స్థాయికి చేరాయి. ఈ రోజు పెట్రోలు(petrol) ధరపై లీటరుకు 31-35 పైసలు, డీజిల్(diesel) ధర లీటరుకు 33-37 పైసలు పెరిగింది.ఈ నెల అక్టోబర్‌లో ఇప్పటివరకు 19 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) బెంచ్‌మార్క్ అంతర్జాతీయ ధర, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ.107.94గా ఉంది, నిన్నటి ధర నుండి 35 పైసలు పెరిగింది. ఇదిలా ఉండగా రాజధాని నగరంలో డీజిల్ లీటరుకు 35 పైసలు పెరిగి రూ.96.67గా ఉంది.

మెట్రో నగరాల్లో ముంబై పెట్రోల్ ధర ఇప్పటికీ అత్యధికంగా ఉంది. ముంబైలో పెట్రోల్ లీటరు రూ.114 మార్కుకు చేరువవుతోంది ప్రస్తుతం లీటరు రూ.113.80కి విక్రయిస్తోంది. దేశ ఆర్థిక రాజధానిలో డీజిల్ ధర లీటరుకు రూ.104.75.
 

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం నాటి ధరపై 34 పైసలు పెంపుతో లీటర్ డీజిల్‌ ధర  రూ. 99.78, లీటర్ పెట్రోల్‌ ధర  రూ.108.45కు వచ్చింది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.83, తమిళనాడు రాజధానిలో డీజిల్ రూ.100.92కి చేరుకుంది.

బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.70 కాగా, హైదరాబాద్‌లో లీటరు ధర రూ.112.27గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్‌లో లీటరు డీజిల్‌ రూ.102.60, రూ.105.46కి చేరింది.
 

ప్రధాన భారతీయ నగరాల్లో భోపాల్, జైపూర్‌లలో ఇంధనం ధరతో చాలా అధికంగా ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.116.62 కాగా, డీజిల్ లీటరుకు రూ.106.01గా ఉంది. జైపూర్‌లో పెట్రోల్ , డీజిల్ ధర వరుసగా రూ.115.21, లీటరుకు రూ.106.47.

ప్రభుత్వ ఆయిల్ రిఫైనర్ ప్రకారం ఆరు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు ముంబైలో అత్యధికంగా ఉన్నాయి. విలువ ఆధారిత పన్ను లేదా VAT కారణంగా ఇంధన ధరలు ప్రతి రాష్ట్రాలలో మారుతూ ఉంటాయి.

పెట్రోల్‌ రిటైల్‌ ధరలో 61 శాతం, డీజిల్‌పై దాదాపు 56 శాతం కేంద్ర, రాష్ట్ర పన్నులు ఉంటాయి. కేంద్రం లీటర్ పెట్రోల్‌పై రూ.32.9, డీజిల్‌పై రూ.31.80 ఎక్సైజ్ సుంకం విధిస్తోంది.

click me!