మళ్ళీ ఎగిసిన క్రూడాయిల్.. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయా? ఇక్కడ చెక్ చేసుకోండి..

First Published | Nov 10, 2023, 10:29 AM IST

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ఈరోజు అంటే శుక్రవారం క్రూడాయిల్  ధర పెరిగింది. ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు నిరంతరం తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 80.14 స్థాయిలో ట్రేడవుతోంది, దింతో  0.16 శాతం పెరిగింది.  కాగా డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.03 శాతం పెరిగి బ్యారెల్‌కు 75.76 డాలర్ల చొప్పున ట్రేడవుతోంది. 

petrol pump

మరోవైపు చమురు కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను విడుదల చేశాయి. అయితే ఈరోజు అంటే శుక్రవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్  డీజిల్ ధరలలో చివరి మార్పు మే 2022లో జరిగింది. అప్పటి నుంచి ధరలు స్థిరంగా ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు

దేశంలో ఈరోజు శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర లీటర్ రూ.94.27గా ఉంది. అంతే కాకుండా చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. కోల్‌కతాలో శుక్రవారం లీటరు పెట్రోల్‌ ధర రూ.106.03, డీజిల్‌ ధర రూ.92.76.

Latest Videos


ఇతర నగరాల్లో ధరలు

శుక్రవారం నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్  ధర రూ.89.96గా ఉంది. గురుగ్రామ్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.18, డీజిల్‌ ధర రూ.90.05. అంతే  కాకుండా చండీగఢ్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.96.20, డీజిల్‌ ధర రూ.84.26. లక్నోలో పెట్రోల్ ధర రూ. 96.57 డీజిల్ లీటర్ ధర రూ. 89.76. హైదరాబాద్  పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82.

ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించి  కొత్త రేట్లు విడుదల చేస్తారు. పెట్రోల్  డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌ను మనం ఇంత ఎక్కువకి కొనుగోలు చేయాల్సి రావడానికి ఇదే కారణం.

మీరు SMS ద్వారా మీ నగరంలోని  పెట్రోల్,  డీజిల్ ధరలను కూడా  తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి అలాగే HPCL (HPCL) కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి sms పంపవచ్చు. BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి sms పంపవచ్చు.
 

click me!