బెస్ట్ ఫీచర్స్ తో ఉన్న Moto G35 5G ఫోన్ ధర ఇంత తక్కువా?

Published : Dec 11, 2024, 12:26 PM IST

Motorola నుంచి కొత్త 5G ఫోన్ రిలీజ్ అయ్యింది. Moto G35 పేరుతో ఇటీవలే మార్కెట్ లోకి వచ్చిన ఈ ఫోన్ లో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. కాని ఈ ఫోన్ ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. Moto G35 ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 

PREV
15
బెస్ట్ ఫీచర్స్ తో ఉన్న Moto G35 5G ఫోన్ ధర ఇంత తక్కువా?

మోటొరోలా కంపెనీ సుమారు వందేళ్ల చరిత్ర ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ ప్రోడక్ట్స్ తయారు చేస్తూ వ్యాపార రంగంలో దిగ్గజ కంపెనీగా ఎదిగింది. కార్డ్ లెస్ ఫోన్లు, కీప్యాడ్ ఫోన్లు, టచ్ స్క్రీన్, స్మార్ట్ మొబైల్ ఇలా దశలవారీగా తన ప్రోడక్ట్స్ అప్ డేట్ చేస్తూ అగ్రగామిగా కొనసాగుతోంది. సెల్ ఫోన్ల తయారీలో ఇప్పటికే ఎన్నో రకాల మోడల్స్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు 10 డిసెంబర్ 2024న Moto G35 5G మొబైల్ ను లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ఫీచర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

25

Moto G35 5G ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ తో 6.72 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని ఉపయోగించారు. ఇది 4GB RAMను కలిగి ఉంది. Moto G35 5G Android 14 ఆధారంగా పనిచేస్తుంది. 5000 mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ ఈ ఫోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. 
 

35

Moto G35 5G లో కెమెరాల విషయానికొస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ప్రత్యేకంగా సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ కూడా ఇందులో ఉంది. 
 

45

Moto G35 5G హలో UI ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. మైక్రో SD కార్డ్ 128 GB మెమొరీ కార్డ్ ను కలిగి ఉంటుంది. Moto G35 సిమ్, నానో-సిమ్ కార్డ్‌లతో డ్యూయల్ సిమ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ బరువు కేవలం 185 గ్రాములు మాత్రమే ఉంటుంది. అందువల్ల హ్యాండిలింగ్ సులభంగా ఉంటుంది. ఇది రెడ్, గ్రీన్, బ్లాక్ రంగులలో లభిస్తుంది. దుమ్ము, వాటర్ నుంచి రక్షణ కోసం IP52 లేయర్ కూడా ఇందులో ఉంది. 
 

55

Moto G35 5Gలోని కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, GPS, బ్లూటూత్ v5.00, NFC, USB టైప్-C, FM రేడియో, 4G మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఫోన్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కంపాస్/మాగ్నెటోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. Moto G35 5Gలో ఫేస్ అన్‌లాక్‌  ఫీచర్ కూడా ఉంది. మార్కెట్ లో దీని ప్రారంభ ధర రూ. 9,999గా ఉంది.

 

click me!

Recommended Stories