పండగకి ముందు స్థిరంగా పెట్రోల్, డీజిల్.. బంకుకి వెళ్లే ముందు నేడు లీటరు ధర ఎంతో చెక్ చేసుకోండి..

First Published | Sep 22, 2023, 10:06 AM IST

ఇండియాలోని ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్ డీజిల్ కొత్త ధరలను ప్రకటిస్తాయి.  నేడు ఢిల్లీ, ముంబై ఇంకా కోల్‌కతా వంటి అనేక మెట్రోపాలిటన్ నగరాల్లో ఇంధన ధరలు మారలేదు.  
 

న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27, కోల్ కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటర్ రూ.92.76.

చెన్నై-  పెట్రోల్ ధర 11 పైసలు పెరిగి లీటరుకు రూ. 102.74. డీజిల్ ధర రూ. 94.33.

అహ్మదాబాద్- పెట్రోలు ధర 35 పైసలు పెరిగి లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర 36 పైసలు పెరిగి రూ. 92.32.

గురుగ్రామ్- పెట్రోలు ధర 33 పైసలు పెరిగి రూ. 96.99, డీజిల్ ధర 32 పైసలు పెరిగి లీటరు రూ. 89.86.
 

నోయిడా- పెట్రోల్ ధర 17 పైసలు తక్కువ ధరకు రూ. 96.59కి, డీజిల్ లీటరుకు 17 పైసలు తగ్గి  రూ. 89.76కి చేరింది.

ఆగ్రా- పెట్రోల్ 28 పైసలు తక్కువ ధరకు రూ. 96.20కి, డీజిల్ ధర లీటరుకు 27 పైసలు తక్కువ ధరకు రూ. 89.37కి చేరింది.

హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82
 

Latest Videos


అంతర్జాతీయ మార్కెట్‌లో ఈరోజు క్రూడాయిల్  ధరలు స్వల్పంగా పెరిగాయి. WTI క్రూడ్ 0.06 శాతం పెరుగుదలతో బ్యారెల్‌కు $ 89.58 వద్ద ట్రేడవుతోంది.  బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.09 శాతం పెరిగి 93.07 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలను బట్టి భారత్‌లో ఇంధనం ధర నిర్ణయించబడుతుంది. 
 

భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్  డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇవి రోజువారీ ప్రాతిపదికన చేయబడుతుంది ఇంకా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.

అయితే ఇంధన ధరలు, వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన అంశాలపై ఆధారపడి రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.
 

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.
 

click me!