వామ్మో.. ముకేశ్ అంబానీ ఇల్లు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా ? ప్రస్తుతం ఈ ఇంటి విలువ ఎంతంటే..?

First Published | Sep 21, 2023, 5:16 PM IST

ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో  ఒకరైన ముకేశ్  అంబానీ గురించి ఎవరికి తెలియదు చెప్పండి.. అంబానీ కుటుంబం లగ్జరీ లైఫ్ స్టయిల్  తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. ప్రస్తుతం అంబానీ కుటుంబం 15,000 కోట్ల రూపాయల కళ్ళు చెదిరే  బంగ్లాలో నివసిస్తోంది. అయితే దీన్ని ఎవరు నిర్మించారో, నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీకు తెలుసా?
 

 ముకేశ్ అంబానీ ఇంటిని యాంటిలియా అని కూడా పిలుస్తారు. 27 అంతస్తుల ఈ భవనంలో ముకేశ్ అంబానీ కుటుంబం మాత్రమే నివసిస్తుంది.  అయితే 15వేల  కోట్లతో ఈ యాంటిలియా భవనాన్ని నిర్మించారు. ఇందులో  మొత్తం 27 అంతస్తులు ఉన్నాయి. అంటే 173 మీటర్లు (568 అడుగులు) ఎత్తు. మొత్తం ఇంటి నిర్మాణం 37,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో  ఉంది. యాంటిలియాలో 168 కార్ల గ్యారేజ్, 9 హై స్పీడ్ లిఫ్టులు, 50 సీట్ల థియేటర్, టెర్రస్డ్ గార్డెన్స్, స్విమ్మింగ్ పూల్, స్పా, హెల్త్ సెంటర్ ఇంకా టెంపుల్ ఉన్నాయి.

యాంటిలియాను అమెరికన్ సంస్థ పెర్కిన్స్ & విల్ ఇంకా  లాస్ ఏంజిల్స్‌కు చెందిన నిర్మాణ సంస్థ హిర్ష్ బెట్నర్ అసోసియేట్స్ రూపొందించారు. యాంటిలియా నిర్మాణం 2006లో ప్రారంభమైంది  2010లో పూర్తయింది.

యాంటిలియాలో ముఖేష్ అంబానీ అతని కుటుంబ సభ్యులు తమ ఇంటి అతిథులను కోసం  గ్రాండ్ రూమ్‌లు ఉన్నాయి. ఇంటి హల్  లేటెస్ట్ సోఫాలు ఇంకా హై -క్వాలిటీ పెయింటింగ్‌తో  ఉంటుంది.


పెర్కిన్స్ & విల్ చికాగోలో ఉంది, దీని CEO బిల్ హారిసన్ అనే బ్రిటీష్ వ్యాపారవేత్త. బిల్ హారిసన్ మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ ఇంకా  గూగుల్ వైస్ ప్రెసిడెంట్ అలాగే జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. బిల్ హారిసన్ 1989 నుండి 1992 వరకు మైండ్‌స్కేప్ ఇంటర్నేషనల్‌లో డెవలప్‌మెంట్ హెడ్‌గా ఉన్నారు. 

బిల్ హారిసన్ 9 US రాష్ట్రాలు, 2 కెనడియన్ భూభాగాలలో లైసెన్స్ పొందిన ఆర్కిటెక్ట్. అతను 2006లో పెర్కిన్స్ & విల్  CEOగా నియమించబడ్డాడు. బిల్ హారిసన్ తన కుటుంబంతో కలిసి అట్లాంటాలో నివసిస్తున్నాడు.

అంబానీ కుటుంబం 2012లో యాంటిలియాకు వెళ్లింది, ప్రస్తుతం  ఈ ఇంటి విలువ రూ.15,000 కోట్లు. యాంటిలియా ఇంటి డిజైన్, ఇంటీరియర్, గ్రాండ్ పార్టీలు, సేఫ్టీ ఇంకా  మరెన్నో కారణాల వల్ల తరచుగా వార్తల్లో ఉంటుంది. యాంటిలియా ఫోటోలు  ఇంటర్నెట్‌లో కూడా ఉన్నాయి.
 

27 అంతస్తుల యాంటిలియా  లగ్జరీ బంగ్లాలో మొత్తం 600 మంది పనిచేస్తున్నారు. వీళ్లు మామూలు వారు కాదు, ఉన్నత విద్యావంతులు. చెత్త ఊడ్చడానికి, బట్టలు ఉతకడానికి, వంట చేయడానికి చాలా మందిని విడివిడిగా నియమిస్తారు.
 

అంబానీ హౌస్ యాంటిలియాలో పని చేసే వారు శిక్షణ పొందారు. వీరికి నెలకు 2 లక్షల జీతం ఉంటుందట. ఇంకా యాంటిలియాకు సర్వెంట్ క్వార్టర్స్ అనే స్థలం ఉంది. ఇక్కడ అందులో పనిచేసే వారు ఉండవచ్చు.
 

Latest Videos

click me!