సాధారణంగా ఈపీఎఫ్ పథకంలో ఉద్యోగితో పాటు సంస్థ కొంత మొత్తంలో డబ్బు జమ చేస్తుంటుంది. ఉద్యోగి బేసిక్ శాలరీలో 12 శాతం, అలాగే అంతే మొత్తం ప్రతీ నెలా కంపెనీ సైతం పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది.
పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తంపై ప్రభుత్వం వడ్డీ అందిస్తుంది. పదవి విరమణ తర్వాత డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో మధ్యలో కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు
పీఎఫ్‌తో కోట్లు సంపాదించవచ్చా?
పీఎఫ్ ఖాతా ద్వారా రూ. కోటి ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మీకు రూ. 50,000 జీతం రావాల్సి ఉంటుంది. మీరు 30 ఏళ్ల పాటు ఉద్యోగంలో ఉండాలి. నెలకు రూ. 50 వేల జీతంతో పాటు ప్రతీ ఏటా 5 శాతం హైక్స్ ఉండాలి.
8.1 శాతం చొప్పు వార్షిక వడ్డీ లభిస్తే 30 ఏళ్ల తర్వాత.. మీ పదవీ విరమణ నాటికి పీఎఫ్ అమౌంట్ సులభంగా రూ. కోటి దాటుతుంది.
కాంపౌండింగ్ ప్రయోజనం కూడా..
30 ఏళ్ల ఉద్యోగం, జీతం పెరుగుదలతో పాటు కాంపౌండింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. దీంతో పదవీ విరమణ సమయానికి మీ పీఎఫ్ ఖాతాలో భారీ మొత్తంలో జమ అవుతుంది.
ఈపీఎఫ్ఓ ఖాతా ఉన్న ఉద్యోగులకు పొదుపు, బీమా కవర్, పెన్షన్, వడ్డీ రహిత వడ్డీ లభిస్తుంది. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో పీఎఫ్ నుంచి డబ్బు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.